హద్దులు దాటేసిన తమన్నా

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న అందాల భామ తమన్నా. ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దకాలం పాటు చక్రం తిప్పింది. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో సినిమాలు చేస్తూ వచ్చింది. 100% లవ్, రచ్చ సినిమాలతో తమన్నా తెలుగులో టాప్ స్టార్ గా మారిపోయింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా స్టార్స్ అందరితో నటించింది.

ప్రస్తుతం తెలుగులో భోళా శంకర్ సినిమాలో మెగాస్టార్ కి జోడీగా తమన్నా నటిస్తోంది. రజినీకాంత్ తో జైలర్ మూవీలో కూడా కీలక పాత్రలో కనిపించబోతోంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ హిందీలో లస్ట్ స్టోరీస్ 2లో నటించింది. ఈ ఆంథాలజీ ఫిల్మ్ తాజాగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. హిందీలో ఇప్పటికీ జీకర్దా వెబ్ సిరీస్ లో తమన్నా వైల్డ్ బోల్డ్ ఇంటిమేట్ సన్నివేశాలలో నటించింది.

ఇప్పుడు లస్ట్ స్టోరీస్ 2లో తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో ఏకంగా లిప్ లాక్, బెడ్ రూమ్ రొమాంటిక్ ఇంటిమేట్ సన్నివేశాలలో అయితే ఎలాంటి తడబాటు లేకుండా యాక్ట్ చేసింది. లస్ట్ స్టోరీస్ 2 రిలీజ్ కి ముందు ప్రమోషన్స్ లో భాగంగా తమన్నా, విజయ్ రొమాంటిక్ సన్నివేశాన్ని సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తే నెటిజన్లు నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.

అయితే ప్రస్తుతం మూవీ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన తర్వాత డిజిటల్ ఆడియన్స్ తమన్నా రొమాంటిక్ అండ్ ఇంటిమేట్ సీన్స్ ని భాగానే ఆశ్వాదిస్తున్నారు. విజయ్ వర్మ, తమన్నా మధ్య కెమిస్ట్రీ వర్క్ అవుట్ అయ్యిందనే టాక్ వినిపిస్తోంది. లస్ట్ స్టోరీస్ 2 లో మరో లీడ్ చేసిన మృణాల్ ఠాకూర్ కి సంబందించిన రొమాంటిక్ బెడ్ రూమ్ సన్నివేశాలు కూడా ఈ సిరీస్ ని ఇష్టపడే వారికి కనెక్ట్ అయ్యింది.

ఓవరాల్ గా లస్ట్ స్టోరీస్ 2ని మేకర్స్ ఏ టార్గెట్ తో అయితే తెరకెక్కించారో దాని వరకు సక్సెస్ అయినట్లే అని చెప్పాలి. ఓవరాల్ గా ఎలా ఉందనేది కొద్ది రోజులు క్లారిటీ వచ్చేస్తుంది. ఇక లస్ట్ స్టోరీస్ 2లో ఈ స్థాయిలో తమన్నా రొమాంటిక్ సన్నివేశాలలో నటించడానికి కారణం బాలీవుడ్ సక్సెస్ కోసమే అనే టాక్ వినిపిస్తోంది.