సర్ప్రైజ్ : ఓటిటిలో “భగవంత్ కేసరి” ఎప్పుడు ఎందులో అంటే

ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో పండుగ కానుకగా వచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి. మరి వీటిలో రీసెంట్ గా దసరా కానుకగా వచ్చిన చిత్రం “భగవంత్ కేసరి” కూడా ఒకటి. మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కించిన మొదటి సినిమా ఇది కాగా రిలీజ్ అయ్యి బాలయ్య కెరీర్ లో మరో బిగ్ హిట్ గా ఐతే ఇది నిలిచింది.

ఇలా వరుస విజయాలతో హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య ఇప్పుడు ఓటిటి లో సందడి చేసేందుకు సిద్ధం అయినట్టుగా తెలుస్తుంది. అయ్యితే ఈ సినిమా ఓటిటి రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం సర్ప్రైజింగ్ గా రేపటి నుంచే అంటే నవంబర్ 24 నుంచే వచ్చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. మరి ఇది మాత్రం నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అని చెప్పాలి.

ఈరోజు రాత్రి 12 గంటలు నుంచే సినిమా వచ్చేస్తుంది అని సమాచారం. కాగా ఈ సినిమా మొదట ఒక్క తెలుగులోనే స్ట్రీమింగ్ కి వచ్చి తర్వాత యాడ్ చేస్తే ఇతర ముఖ్య భాషల్లో రావచ్చని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ నటించగా యంగ్ సెన్సేషన్ శ్రీలీల ఈ చిత్రంలో ముఖ్య పాత్ర చేసింది. అలాగే సంగీత దర్శకుడు థమన్ ఈ సినిమాకి వర్క్ చేయగా షైన్ స్క్రీన్ వారు నిర్మాణం వహించారు.