షాకింగ్ : అసలు పోల్చుకోలేని విధంగా మారిపోయిన సూర్య.!

ఇండియన్ సినిమా దగ్గర నటన కోసం పాత్ర కోసం ఎంతవరకు అయినా వెళ్ళగలిగే నటులు హీరోస్ లో కోలీవుడ్ నుంచే చాలా మంది ఉన్నారు. కమల్ హాసన్, రజినీకాంత్, విక్రమ్ అలాగే సూర్య లు ఎన్నో ఐకానిక్ పాత్రలకి ప్రాణం పోశారు. అయితే ఎన్నో చిత్రాల్లో ఎన్నో ఊహించని గెటప్ లు వేసిన వీరు ఇప్పుడు మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నారు.

అయితే వీరిలో హీరో సూర్య మరోసారి ఓ కొత్త లుక్ లోకి మారడం షాకింగ్ గా మారింది. ఇప్పుడు దర్శకుడు శివ తో “కంగువ”  అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో భిన్నమైన టైం లైన్స్ కనిపించనుండగా వీటిలో సూర్య డిఫరెంట్ లుక్స్ లో ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కోసం సూర్య ప్రిపేర్ చేసిన లుక్స్ ఆసక్తిగా మారాయి.

భారీ దేహంతో ముఖం కూడా గుర్తించలేని విధంగా సూర్య మారిపోయాడు. దీనితో అసలు ఇది మేకప్పా లేక నిజంగా సూర్య బరువు పెరిగాడా అనే ప్రశ్న ఆసక్తిగా మారింది. అయితే ఇది మేకప్ అనే తెలుస్తుంది. సూర్య తనకి అలవాటు ఉన్న ప్రొస్థెటిక్ మేకప్ లో అయితే ఈ లుక్ కి మారాడు అట.

మరి గతంలో కూడా సూర్య ఎన్నో చిత్రాలకి ఈ మేకప్ వేసుకున్నాడు. సుందరాంగుడు, వీడోక్కడే, 24 ఇలా చాలా చిత్రాల్లోనే సూర్య ట్రై చేసాడు. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాకి ట్రై చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ భారీ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.