గ్లింప్స్ టాక్ : బ్రిలియెంట్ విజువల్స్ తో ఫిరోసియస్ గా సూర్య “కంగువ”

తమిళ నాట సినిమా అంటే ప్రాణం ఇచ్చే నటులు ఎంతోమంది ఉన్నారు మరి అలాంటి టాలెంటెడ్ హీరోస్ లో అయితే స్టార్ హీరో సూర్య కూడా ఒకరు కాగా సూర్య నటిస్తున్న లేటెస్ట్ చిత్రమే “కంగువ”. దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తమిళ  నాట సహా సూర్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు.

అయితే ఈరోజు సూర్య బర్త్ డే కానుకగా మేకర్స్ ఈ అవైటెడ్ గ్లింప్స్ ని విడుదల చేయగా ఇది మాత్రం రీసెంట్ టైం లో వచ్చిన బెస్ట్ గ్లింప్స్ లలో ఒకటి అని చెప్పాలి. అయితే ఇందులో నెక్స్ట్ లెవెల్ విజువల్స్ ని చాలా బ్రిలియెంట్ టేక్ తో చూపించారు అని చెప్పాలి.

కాగా ఈ భారీ చిత్రంలో విజువల్స్ చాలా నాచురల్ గా కనిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రం 3డి లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విజువల్స్ నే 3డి లో చూస్తే మరింత సాలిడ్ గా ఉంటాయని చెప్పాలి. ఇక ఈ విజువల్స్ అనంతరం అయితే సూర్య అయితే ఫిరోసియస్ లుక్స్ లో ఊహించని లెవెల్లో ఉన్నాయి.

మెయిన్ గా తన విలన్ షేడ్ నటన అదిరిపోయింది అని చెప్పాలి. పైగా తన లుక్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఓవరాల్ గా అయితే ఈ క్రేజీ టీజర్ గ్లింప్స్ సినిమాపై మరిన్ని అంచనాలు తెచ్చింది. అని చెప్పాలి. అయితే ఇందులో హాలీవుడ్ లెవెల్ విజువల్స్ తో పాటుగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా హైప్ ని మ్యాచ్ చేసే విధంగా చాలా డిఫరెంట్ గా ఇవ్వడం గమనార్హం.

ఇక ఈ గ్లింప్స్ అయితే తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ సహా ఇంగ్లీష్ లో కూడా రిలీస్ అయ్యింది. ఇక ఈ చిత్రంలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుండగా గ్రీన్ స్టూడియోస్ వారు నిర్మాణం వహించారు. 
Kanguva - Glimpse | Suriya, Disha Patani | Devi Sri Prasad | Siva | Studio Green | UV Creations