Arun Vijay : ఓ మై డాగ్ తమిళ సినిమా విడుదల తేదీ ఖరారు…!

Arun Vijay : తమిళ హీరో సూర్య తన సొంత బ్యానర్ 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం ఓ మై డాగ్. తండ్రి కొడుకు మధ్యలో కుక్కతో సాగే కథ. సీనియర్ నటుడు విజయ్ కుమార్ కొడుకు అరుణ్ విజయ్ నటిస్తున్న ఈ సినిమాలో తన కొడుకు ఆర్నవ్ విజయ్ కూడా ఈ సినిమా లో నటిస్తుండడం విశేషం. ఇక ఈ సినిమా ను సూర్య జ్యోతిక వారి సొంత బ్యానర్ 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ఓ కుక్కకు పిల్లాడికి మధ్య ఉన్న అనుబంధం నేపథ్యంలో తండ్రి – కొడుకుల మధ్య సాగే సెంటిమెంట్ గా మూవీని దర్శకుడు రూపొందించారు. ఈ సినిమాను సరోజ్ షణ్ముగం తెరకెక్కించాడు. ఇక సంగీతం నివాస్ కె ప్రసన్న దీనికి అందించాడు. సినిమా ను ఓటీటీ లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.నిజానికి ఈ సినిమాను గత ఏడాది డిసెంబర్ లోనే అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయాలనుకున్నా కుదరలేదు. ఇప్పుడు తెలుగులోనూ అనువాదం చేసి ఈ నెల 21న స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇందులో విజయ్ కుమార్, మహిమా నంబియార్, వినయ్ రాయ్ కీలక పాత్రలు పోషించారు. మరి యాక్షన్ హీరోగా ఇటీవల కాలంలో గుర్తింపు తెచ్చుకున్న అరుణ్‌ విజయ్ కు ‘ఓ మై డాగ్’ ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.

ఇక సూర్య అమెజాన్ ప్రైమ్ తో ఆ మధ్య ఒప్పందం చేసుకున్నాక తన సొంత సినిమాలను ఓటీటీ లో విడుదల చేస్తున్నారు.తన 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద తీసే సినిమాలను డైరెక్ట్ ఓటీటీ ద్వారానే విడుదల చేస్తున్నాడు సూర్య. అందుకే ఆ మధ్య ‘ఉడన్ పిరప్పి’, ‘జై భీమ్’ చిత్రాలు కూడా ఓటీటీ లోనే స్ట్రీమింగ్ అయ్యాయి.