ఇద్దరు యంగ్ బ్యూటీస్ తో లెడీ మల్టీస్టారర్ ప్లాన్ చేసిన ప్రముఖ నిర్మాణ సంస్థ ..?

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ నివేదా థామస్ ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన దర్బార్ లో నటించిన నిత్యా రీసెంట్ గా నాని సుధీర్ బాబు హీరోలుగా నటించిన వి సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలలో నిత్యా మీనన్ క్యారెక్టర్ కి మంచి పేరొచ్చింది. ఇక ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ లో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాలో పవర్ స్టార్ తర్వాత మళ్ళీ అంతగా నివేదా థామస్ హైలెట్ అవుతుందని అంటున్నారు.

Nivetha Thomas in Prabhas 21?- The New Indian Express

ఇక మరో బ్యూటిఫుల్ హీరోయిన్ రెజీనా కసాండ్ర గత ఏడాది అడవి శేష్ నటించిన ఎవరు సినిమాతో మంచి హిట్ అందుకుంది. అలాగే హిట్ అన్న సస్పెన్స్ థ్రిల్లర్ లో కూడా నటించి మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉన్న రెజీనా మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో రెజీనా స్పెషల్ సాంగ్ లో మెగాస్టార్ తో కలిసి స్టెప్పులేసింది. ఈ సాంగ్ సినిమాకి బాగా ప్లస్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది.

Regina Cassandra Biography, Age, Height, Husband, Boyfriend, Family, Wiki

అయితే ఇప్పుడు నివేదా థామస్ – రెజీనా కసాండ్ర కలిసి ఒక లేడీ మల్టీ స్టారార్ లో నటించబోతున్నట్టు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిచబోతుందట. వాస్తవంగా ఈ సినిమా లాక్ డౌన్ కి ముందే ప్రారంభం కావాల్సి ఉండగా నిలిచిపోయింది. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందాల్సి ఉంది. అన్నట్టు ఈ సినిమాలో నివేదా థామస్ – రెజీనా కసాండ్ర పోలీస్ పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. అయితే ఈ సినిమా నుంచి ప్రస్తుతం ఎలాంటి అప్‌డేట్ లేకపోయినప్పటికి విశ్వసనీయ వర్గాలా ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ మొదలైందని తెలుస్తోంది.