సురేందర్ రెడ్డి నెక్స్‌ట్.! మెగా హీరోతోనేనా.?

దర్శకుడు సురేందర్ రెడ్డి ‘ఏజెంట్’ తర్వాత ఏం చేయబోతున్నాడు.? ‘ఏజెంట్’ డిజాస్టర్ నేపథ్యంలో సురేందర్ రెడ్డి మీద చాలా చాలా విమర్శలు వచ్చాయి. కథ, కాకరకాయ్ లేకుండా సినిమా స్టార్ట్ చేశామంటూ ‘ఏజెంట్’ నిర్మాత, తప్పంతా దర్శకుడిదే అన్నట్లు పరోక్షంగా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే, సురేందర్ రెడ్డి ఎక్కడా ఈ విషయమై స్పందించలేదు.

ఇదిలా వుంటే, పవన్ కళ్యాణ్‌తో ఓ సినిమా చేయాల్సిన సురేందర్ రెడ్డి, అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ లేటవడంతో.. పలువురు యంగ్ హీరోలతో టచ్‌లోకి వెళ్ళాడు.

ప్రస్తుతం వినిపిస్తున్న గాసిప్స్ ప్రకారం చూస్తే, త్వరలో ఓ మెగా హీరోతో సురేందర్ రెడ్డి సినిమా పట్టాలెక్కేలా వుంది. సాయి ధరమ్ తేజ్‌కి సురేందర్ రెడ్డి ఓ కథ చెప్పాడన్నది తాజా ఖబర్. రేసులో వరుణ్ తేజ్ కూడా వున్నాడట.

వాస్తవానికి, రామ్ చరణ్‌తోనూ ఓ సినిమా చేయాల్సి వుంది సురేందర్ రెడ్డి.! ఏం జరుగుతుందో చూడాలిక.