సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తోపులాటలో ఒక మహిళ మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ కేసు విషయంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ శనివారం ఉదయం 6:30 నిమిషాలకు మద్యంతర బెయిల్ పై విడుదలైన సంగతి కూడా అందరికీ తెలిసిందే. జైలు నుంచి విడుదలైన బన్నీ ముందు గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకొని అక్కడ తన న్యాయవాదుల బృందంతో మాట్లాడారు.
ఆ తరువాత జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. అప్పటికే తన కోసం ఆవేదనతో ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులను హత్తుకొని చాలా ఎమోషనల్ అయ్యారు. తన కొడుకుని కౌగిలించుకొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. అప్పటికే అర్హ తండ్రి కోసం ఎదురు చూస్తుండడం సోషల్ మీడియాలో చూడవచ్చు.ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు బన్నీ ఇంటికి చేరుకొని అతనికి వారి సానుభూతి తెలియజేస్తున్నారు.
ఇప్పటికే హీరోలు విజయ్ దేవరకొండ, ఆనంద దేవరకొండ, రాణా,శ్రీకాంత్ వంటి వాళ్ళు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. దర్శకులు సుకుమార్, వంశీ పైడిపల్లి, కొరటాల శివ వంటి వాళ్ళు బన్నీని పలకరించి తమ సానుభూతి తెలియజేశారు.ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న అల్లు అర్జున్ మేనత్త, చిరంజీవి భార్య సురేఖ అల్లు అర్జున్ ని చూసి భావోద్వేగానికి గురైంది. అల్లు అర్జున్ కూడా మేనత్తని దగ్గరికి తీసుకొని హగ్ చేసుకుని ఆమె చేతిని ముద్దాడడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
అల్లు అర్జున్ కి మేనత్త సురేఖకి మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే జరిగిన సంఘటన గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ బాధిత కుటుంబాన్ని త్వరలోనే కలుస్తానని అలాగే తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శ్రీ తేజ పరామర్శ కోసం వెళ్తానని చెప్పిన బన్నీ ఆ కుటుంబానికి తన క్షమాపణ కూడా చెప్పాడు. అయితే అల్లు అర్జున్ అరెస్టుపై పలువురు సెలబ్రిటీలు తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు.