బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలె కి స్పెషల్ సర్‌ప్రైజ్ గా సూపర్ స్టార్ ..?

ఇండియాలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 మొదలైనప్పటి నుంచి మంచి రేటింగ్ తో రసవత్తరంగా సాగుతోంది. అంతేకాదు గత 3 సీజన్స్ కంటే ఈ సీజన్ కి రేటింగ్ బాగా వస్తుందన్న టాక్ వినిపిస్తోంది. కరోనా కారణం గా ఈ సారి బిగ్ బాస్ ఉండదని భావించిన సమయంలో నాగార్జున ప్రోమో రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు స్టార్ మా. ఇక ప్రతీవారం ఊహించని ట్విస్టులిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఎలిమినేషన్ ఉన్నట్టే అందరినీ నమ్మించి చివరికి నో ఎలిమినేషన్ దిస్ వీక్ అంటూ షాకిలిచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Bigg Boss 4 Telugu to begin in August- Cinema express

ప్రేక్షకులని సర్‌ప్రైజ్ చేయడం కోసమే ఇదంతా అన్న బిగ్ బాస్ నిర్వాహకుల స్ట్రాటజీ కి ఖంగుతిన్న వాళ్ళు ఉన్నారు. ప్రముఖ యాంకర్ సుమ విషయంలో ఈ విషయం అందరికీ బాగా అర్థమైంది. అంతేకాదు ప్రతీవారం ప్రేక్షకులందరూ ఖచ్చితంగా ఈ వారం ఎలిమినేట్ అయ్యేది మోనాల్ అని గట్టిగా ఫికైతే .. బిగ్ బాస్ ఆమె ని సేవ్ చేసి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నాడు. ఎట్టకేలకి మోనాల్ టాప్ 5 కంటెస్టెంట్ లో ఉండటం గొప్పే అని చెపాలి. పెద్దగా క్రేజ్ లేని వాళ్ళని తీసుకు వచ్చి ఇన్నివారాలు టాప్ రేటింగ్ తో షో ని రన్ చేయడం అంటే ఆషామాషీ కాదు.

ఈ విషయంలో బిగ్ బాస్ డబుల్ సక్సస్ అయ్యాడు. కాగా తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 చివరి దశకు చేరుకుంది. దాంతో నిర్వాహకులు గ్రాండ్ ఫినాలే ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. గత సీజన్ లో మెగాస్టార్ చిరంజీవి ఛీఫ్ గెస్ట్ గా వచ్చి ప్రేక్షకులని ఊహించని విధంగా సర్‌ప్రైజ్ ఇచ్చారు. కాగా ఈసారి సూపర్ స్టార్ మహేష్ బాబు గ్రాండ్ ఫినాలే కి వస్తున్నట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ నిర్వాహకులు ఈసారి మరింత గ్రాండ్ గా ఫైనల్ ఎపిసోడ్ ని ప్లాన్ చేస్తున్నారట. అందుకే మహేష్ బాబు ని తీసుకు వస్తున్నట్టు తెలుస్తోంది.