ఫస్ట్ టెలికాస్ట్ లో అదరగొట్టిన “విరూపాక్ష” రేటింగ్.!

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర భారీ హిట్ అయ్యిన చిత్రాల్లో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా దర్శకుడు కార్తీక్ వర్మ దండు తెరకెక్కించిన క్రేజీ హారిఫిక్ థ్రిల్లర్ చిత్రం “విరూపాక్ష” కూడా ఒకటి. కాగా ఈ చిత్రం సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే హైయెస్ట్ వసూళ్లు అందుకున్న సినిమాగానే కాకుండా మొదటి 100 కోట్ల క్లబ్ లో కూడా ఈ చిత్రం చేరింది.

ఇక ఇదిలా ఉండగా ఈ సాలిడ్ చిత్రం థియేటర్స్ లో అలాగే తర్వాత ఓటిటి లో కూడా అదరగొట్టగా ఈ సినిమా తెలుగు లో మొదటి సారి టెలికాస్ట్ కి తీసుకురాగా మంచి రేటింగ్ నే అయితే రాబట్టినట్టుగా తెలుస్తుంది. కాగా స్టార్ మా ఛానెల్లో మొదటిసారి వరల్డ్ ప్రీమియర్ గా టెలికాస్ట్ గా రాగ 11.8 రేటింగ్ అయితే రాబట్టినట్టుగా తెలుస్తుంది.

దీనితో ఈ చిత్రం ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పై కూడా అదరగొట్టింది అని చెప్పాలి. రీసెంట్ టైం లో అయితే పెద్ద హీరోల సినిమాలు కూడా ఈ రేంజ్ లో రాబట్టింది లేదు. చిన్న హీరోలు అయినా కంటెంట్ బాగుంటే ఆడియెన్స్ బుల్లితెర మీద కూడా ఆదరిస్తున్నారు.

అంతెందుకు ఇదే సినిమా టెలికాస్ట్ రోజు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన “వారసుడు” కూడా టెలికాస్ట్ కి మొదటిసారి జెమినీ ఛానెల్లో వచ్చినప్పటికీ దానికి 5 రేటింగ్ కూడా రాలేదు. దీనితో ఆడియెన్స్ కంటెంట్ విషయంలో ఎంత పర్టిక్యులర్ గా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇక విరూపాక్ష లో హీరోయిన్ గా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా వారసుడులో రష్మికా మందన్నా నటించింది.