Nani: సుందరానికి ఆల్ ది బెస్ట్ చెప్పిన సన్ రైజర్స్…స్వీట్ రిప్లై ఇచ్చిన నాని..!

Nani: రాహుల్ దర్శకత్వంలో వచ్చిన శ్యామ్ సింగరాయ్ మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకూండా వసూళ్ల పరంగాను లాభాలు తెచ్చిపెట్టింది. దాదాపు రెండేళ్ల తర్వాత నాని సినిమా థియేటర్లలో సందడి చేసింది.శ్యామ్ సింగరాయ్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న నాని ఇప్పుడు తన తదుపరి సినిమాల షూటింగ్స్ లో జాయిన్ అవుతున్నాడు. వరుస సినిమాలతో ప్రేక్షకులని అలరించేందుకు కొత్త ప్రణాళికలు రచిస్తున్నాడు. ఇటీవల శ్యామ్ సింగరాయ్ చిత్రంతో పలకరించిన నాని ఇప్పుడు అంటే సుందరానికి చిత్రంతో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.

ఇటీవలే ఈ సినిమానుంచి నాని క్యారెక్టర్ ను రివీల్ చేస్తూ ఓ టీజర్ ను వదిలారు.. ఈ టీజర్ ప్రేక్షకుల విపరీతంగా ఆకట్టుకుంది. నాని హీరోగా నటించిన ‘అంటే సుందరానికి’ సినిమా జూన్ 10న విడుదల కానున్నట్లు నిర్మాతలు ప్రకటించిన నేపథ్యంలో.. ‘అంటే ఆ సుందరం జూన్‌లో వస్తాడు, ఈ సుందర్ ఆల్‌రెడీ ట్రైనింగ్ స్టార్ట్ చేశాడు..’ అని సన్‌రైజర్స్ ట్వీట్ చేసింది. ఇందుకు నేచురల్ స్టార్ నాని స్పందించాడు. ‘ఆల్ ది బెస్ట్ సుందర్, ఫ్రం సుందర్..’ అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. వాషింగ్టన్ సుందర్ కూడా ఈ ట్వీట్‌కు స్పందిస్తూ ‘వచ్చాను గయ్స్ ’ అంటూ ట్వీటాడు. ఈ సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.ఐపీఎల్ 2022 సీజన్‌ ప్రారంభానికి మరో వారం రోజుల సమయం మాత్రమే మిగిలుండటంతో అన్ని జట్లలోని ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో బిజీ అయిపోగా, ఆయా ఫ్రాంచైజీలు సోషల్ మీడియా ప్రమోషన్స్‌తో హడావుడి షురూ చేశాయి. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఫ్యాన్స్‌తో అనునిత్యం టచ్‌లోనే ఉంటుంది.

ఇక నాని మరో చిత్రానికి కమిట్ అయ్యారు శ్రీకాంత్ ఓదెల్ల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు దసరా అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో సాగనుంది. మొదటి నాని ఈ సినిమా తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు.