ఫేస్‌బుక్ లైవ్‌లో రాజీవ్ కనకాల.. సుమను అలా చూసి అంతా షాక్!!

Suma Appeared In Rajeev Kanakala Facebook Live

రాజీవ్ కనకాల తాజాగా ఫేస్‌బుక్‌లో లైవ్‌లోకి వచ్చాడు. తన యూట్యూబ్ చానెల్ అయిన మనస్వీని మూవీ మ్యూజిక్ క్రియేషన్స్ గురించి అప్డేట్ ఇచ్చాడు. పనిలో పనిగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇక తన యూట్యూబ్ చానెల్ గురించి చెబుతూ.. అందులో వీఐపీలు, సెలెబ్రిటీల ఇంటర్వ్యూలు, షార్ట్ ఫిలింలు రాబోతోన్నాయని తెలిపాడు. కొత్త యాంకర్, కొత్త డై రెక్టర్, కొత్త టీంతో వీక్షకుల ముందుకు రాబోతోన్నట్టు ప్రకటించాడు.

Suma Appeared In Rajeev Kanakala Facebook Live
Suma Appeared In Rajeev Kanakala Facebook Live

ఈ క్రమంలో కొందరు సుమక్క ఏది, సుమక్కతో కూడా ఓ ఇంటర్వ్యూ చేయండని కోరారు. సుమతో కూడా తప్పకుండా ఇంటర్వ్యూ చేస్తాము.. కానీ ఇప్పుడు మాత్రం కాదు కాస్త సమయం పడుతుందని ఎంతో ఓపిగ్గా సమాధానాలు చెప్పాడు. అలాగే తన కొడుకును 2021లో హీరోగా ఎంట్రీ ఇప్పించబోతోన్నామని తెలిపాడు. తాను కూడా కొన్ని ప్రాజెక్ట్‌లను నిర్మించబోతోన్నట్టు ప్రకటించాడు. షార్ట్ం ఫిలిమ్స్.. వెబ్ సిరీస్‌ ఇలా ఎన్నెన్నో ప్లాన్ చేయబోతోన్నట్టు తెలిపాడు.

Suma Appeared In Rajeev Kanakala Facebook Live
Suma Appeared In Rajeev Kanakala Facebook Live

రాజీవ్ కనకాల ఇలా లైవ్‌లోకి రావడంతో ఇంట్లో పని చేస్తూ అటూ ఇటూ తిరుగుతున్న సుమ కూడా ఓ రెండు సార్లు కనిపించింది. మొహం కనిపించకుండా చేతిని అడ్డం పెట్టుకుంది. ఇంట్లో మేకప్ లేకుండా సాధారణ గృహిణి మల్లే సుమ ఉండటంతో అందరూ షాక్ తిన్నారు. సుమక్క ఎక్కడుందని అడిగితే.. ఇప్పుడే కదా అలా మెరుపుతీగల వచ్చి వెళ్లిందని రాజీవ్ సెటైర్ వేశాడు.