విబేధాలతో విడాకులు!.. వాటికి సుమ ఇలా చెక్ పెట్టేసింది!

రాజీవ్ కనకాల సుమ వ్యవహారం ఎప్పటికీ ఓ మిస్టరీనే. వీరి అన్యోన్య దాంపత్యంపై ఎప్పుడూ చిత్రవిచిత్రమైన రూమర్లు, వార్తలు వస్తుంటాయి. ఇద్దరూ విడిపోయారు.. వేరుగా ఉంటున్నారని ఏవేవో రూమర్లు వినిపిస్తుంటాయి. అయితే వీటిపై ఎప్పుడూ కూడా వారు స్పందించలేదు. అలాంటి అనవసరమైన వార్తలు, రూమర్లపై స్పందించాల్సిన అవసరం లేదని భావిస్తారో ఏమో గానీ ఎన్నడూ ఈ విషయాలపై స్పందించలేదు.

Suma And Rajeev Kanakala Selfie Put Rumors About Issue
Suma And Rajeev Kanakala Selfie Put Rumors About Issue

కానీ ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారని ఒకే చోట ఉండటం లేదని, పిల్లల కోసమే వీరిద్దరు అప్పుడప్పుడూ కలుస్తారని టాక్ వినిపస్తోంది. అయితే ఈ రూమర్లను కొట్టిపడేసేలా ఓ ప్లాన్ చేసింది. ఇటీవలె క్యాష్ షోలో రాజీవ్ కనకాల, సమీర్ ఇలా కొంతమంది పాల్గొన్నారు. ఆ షో మొత్తం వీరి ప్రేమ, అన్యోన్యతలమీదే నడిచింది. చివర్లో సుమను ఎత్తుకోవడం, ఇద్దరూ ఎమోషనల్ అవ్వడంతో వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు, విడిపొవడం వంటివి లేవని చెప్పకనే చెప్పింది.

Suma And Rajeev Kanakala Selfie Put Rumors About Issue
Suma And Rajeev Kanakala Selfie Put Rumors About Issue

ఇక తాజాగా మరోసారి అలాంటి వార్తలకు చెక్ పెట్టేసి విధంగా ఆన్సర్ ఇచ్చింది. వీరిద్దరు దిగిన ఓ ఫోటోను షేర్ చేస్తూ.. అందమైన ప్రకృతి.. అందమైన జీవితం.. మేమిద్దరం ఇలా ఒకే ఫోటోలో అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. మొత్తానికి ఈ జంట మధ్య ఎలాంటి గొడవలు లేవని అందరికీ ఓ క్లారిటీ వచ్చేసి ఉంటుంది.