ఎందయ్యా సుకుమార్… ‘పుష్ప’ లో తొమ్మిది మంది విలన్లా ?

sukumar is planning well with nine villains in pushpa movie
pushpa movie poster
pushpa movie poster

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’. లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది.తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో రష్మిక మందన్నా బన్నీ కి జోడీగా నటిస్తోంది. షూటింగ్ సందర్భంగా బన్నీ గెటప్‌కు సంబంధించి ఇటీవల లీకైన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా మన్యం ప్రాంతం మారేడుమిల్లి అభయారణ్యంలో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.పాన్ ఇండియా లెవల్లో రూపొందనున్న ఈ చిత్రంలో ఇతర నటీనటుల గురించి రోజుకో వార్త వస్తూనే ఉంది.

sukumar is planning big with nine villains in pushpa movie
Allu arjun and sukumar

ఈ సినిమాలో ఏకంగా తొమ్మిది మంది విలన్లను సెట్ చేస్తున్నాడట డైరెక్టర్ సుకుమార్. సీనియర్ కమెడియన్ సునీల్ ని ఇందులో ఓ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కోసం తీసుకున్నారట. ‘డిస్కోరాజా’ ‘కలర్ ఫోటో’ చిత్రాల్లో విలన్ వేషాలు వేసిన సునీల్.. ఇప్పుడు ‘పుష్ప’ లో క్యారెక్టర్ నచ్చడంతో ఓకే చేసాడట. అలానే రావు రమేష్ – ముఖేష్ రుషి లను కూడా విలన్స్ గా తీసుకున్నారట. అలానే మెయిన్ విలన్ ని కూడా ఎంపిక చేసే పనిలో సుకుమార్ బిజీగా ఉన్నారట. మొత్తం మీద ఈ మూవీలో తొమ్మిది మంది విలన్లు ఉన్నారట. త్వరలోనే ప్రధాన నటీనటులను ‘పుష్ప’ టీమ్ అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.