సుకుమార్ ఇంటిలిజెంటే కదా.. ఎందుకు పుష్ప సినిమా విషయంలో ఇలా చేశాడు ..?

మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన అల వైకుంఠపురములో ఇండస్ట్రీ రికార్డ్ గా నిలిచింది. దాంతో మళ్ళీ ఫాం లోకి వచ్చిన అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అన్న పాన్ డియా సినిమాలో నటిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉండబోతుంది. ఇక 5 భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కానున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు.

Team of Pushpa to resume shooting in a dense forest in Nalgonda? | Telugu  Movie News - Times of India

అయితే పుష్ప మొదలైనప్పటి నుంచి అవాంతరాలు బాగానే ఎదురవుతున్నాయి. అంతేకాదు కొంత ముఖ్యమైన కాస్టింగ్ విషయంలోను ఇప్పటి వరకు సరైన క్లారిటీ ఇవ్వడం లేదు మేకర్స్. కరోనా కారణంగా కేరళ లో అనుకున్న భారీ షెడ్యూల్ క్యాన్సిల్ అయి కొంత బడ్జెట్ వేస్ట్ అయిందట. అంతేకాదు ఈ సినిమాలో అల్లు అర్జున్ కి ఆపోజిట్ గా నటించాల్సిన పవర్ ఫుల్ విలన్ ఎవరన్నది సుకుమార్ ఫైనల్ చేయలేకపోతున్నాడని అంటున్నారు.

మిగతా సినిమాలన్ని చక చకా అప్‌డేట్స్ వస్తుంటే పుష్ప సినిమా కి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు వచ్చింది టైటిల్ ని అనౌన్స్ చేస్తూ అల్లు అర్జున్ లుక్ మాత్రమే. ముఖ్యంగా ఈ సినిమాలో విలన్ ఎవరన్నది లెక్కల మాస్టారుకి అంతు చిక్కడం లేదట. అలాగే ఐటం సాంగ్ కి ఒక బాలీవుడ్ బ్యూటీ ఫైనల్ కావాల్సి ఉంది. అంతేకాదు సెకండ్ లీడ్ లో ఉన్న మరో హీరోయిన్ ని అనౌన్స్ చేయాలి. సుకుమార్ చాలా ఇంటిలిజెంట్… నో డౌట్ కాని కరోనా వల్ల ప్లాన్స్ అన్ని తారుమారయ్యాయి అంతే అనుకుంటున్నారు.