Sukumar: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ త్వరలోనే శంకర్ దర్శకత్వంలో నటించిన గేమ్ ఛేంజర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా జనవరి 10వ తేదీ విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో భారీగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల అమెరికాలోని డల్లాస్ నగరంలో ఈ సినిమా వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమానికి డైరెక్టర్ సుకుమార్ కూడా పాల్గొని సందడి చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ సుమ సుకుమార్ గారిని ఒక ప్రశ్న వేశారు మీరు కనుక మీ జీవితంలో ఏదైనా త్యాగం చేయాల్సి వస్తే ఇప్పటికిప్పుడు మీరు ఏం త్యాగం చేస్తారు అంటూ సుమ ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు సుకుమార్ వెంటనే తాను సినిమాలను త్యాగం చేస్తానని ఇకపై సినిమాలు చేయను అంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా పక్కనే ఉన్న రామ్ చరణ్ షాక్ అయ్యారు.
వెంటనే సుకుమార్ చేతిలో ఉన్న మైక్ తీసుకుని అది సాధ్యం కాదంటూ అలా చేయలేరని తెలియజేశారు. దీంతో అభిమానులు కూడా షాక్ అవుతున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. అయితే ప్రస్తుతం పుష్ప సినిమా వల్లే సుకుమార్ ఇలాంటి సమాధానం చెప్పి ఉంటారని అభిమానులు భావిస్తున్నారు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 విడుదల సమయంలో జరిగిన తొక్కిసులాట ఘటనలో భాగంగా అల్లు అర్జున్ ను తెలంగాణ సర్కార్ అలాగే పోలీసులు టార్గెట్ చేసిన విషయం తెలిసిందే.
ఇలా హీరో తప్పు ఏమాత్రం లేకపోయినా హీరోని అరెస్టు చేయడంతో ఈ విషయం కాస్త తెలంగాణలోనూ అలాగే ఏపీలో కూడా పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది. ఈ క్రమంలోనే సుకుమార్ సినిమాల గురించి ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు అయితే త్వరలోనే ఈయన రామ్ చరణ్ తో కూడా ఓ సినిమా చేయబోతున్న విషయం మనకు తెలిసిందే.
Papam ra SUKKU 😢
Waiting for your huge comeback with RC17 ♥️🔥#RamCharan𓃵 #Pushpa2TheRule#Sukumar #RC17pic.twitter.com/LyeJMBPCDK— Negan (@Negan_000) December 23, 2024