సుకుమార్ మల్టీ స్టారర్ ‘చరణ్ అర్జున్’.?

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చాలాకాలం క్రితమే ‘చరణ్ అర్జున్’ అనే టైటిల్‌తో ఓ సినిమా తీయాలనే ఆలోచన చేశారు. మేనల్లుడు రామ్ చరణ్, తనయుడు అల్లు అర్జున్.. ఈ ఇద్దర్నీ పెట్టి మల్టీస్టారర్ సినిమాని సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌లో సినిమా చేయాలన్నది ఆయన డ్రీమ్.!

వాస్తవానికి అల్లు అర్జున్, చరణ్ కలిసి ‘ఎవడు’ సినిమాలో నటించారు. అయితే, తెరపై ఇద్దరూ ఒకేసారి కనిపించరు.! వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందింది ఆ సినిమా.

ఇక, అసలు విషయానికొస్తే, ‘చరణ్ అర్జున్’ సినిమాకి సంబంధించి త్వరలో కీలకమైన ముందడుగు పడబోతోందిట. ఈ ప్రాజెక్టు విషయమై దర్శకుడు సుకుమార్‌తో అల్లు అరవింద్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

‘పుష్ప 2 ది రూల్’ తర్వాత సుకుమార్, ఈ ప్రాజెక్టుని టేకప్ చేసే అవకాశాలున్నాయి. అదే నిజమైతే, ఈ ప్రాజెక్ట్ రేంజ్ ఎలా వుండబోతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఇద్దరూ పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఇటీవలి కాలంలో.

సో, ఈ ఇద్దరి నుంచి మల్టీస్టారర్ వస్తే, అదీ సుకుమార్ దర్శకత్వలో అయితే, ఆ రేంజ్ వేరే లెవల్ అంతే.!