Pushpa 2: మళ్ళీ ఐటమ్ సాంగ్ కు సమంతనే కావాలంటున్నా ఫ్యాన్స్…! బాలీవుడ్ భామను రంగం లోకి దించుతున్న సుక్కు…!

 

Pushpa 2: సమంత దక్షిణాదిన టాప్ హీరోయిన్లలో ఒకరు పెళ్లి తర్వాత ఆలోచించి కథా పరమైన సినిమాలు చేస్తున్న సమంత చైతూ తో విడాకుల తర్వాత మరింత జోరుగా సినిమాలు చేస్తోంది.అటు నార్త్ ఇటు సౌత్ ను కలుపుతూ ఏకంగా హాలీవుడ్ వైపు కూడా చూస్తోంది. సమంత కథానాయికగా నిలదొక్కుకోవడం కోసం మునుపటి రేంజిలో పాపులారిటీని అందుకోవడం కోసం ఇప్పుడు అన్ని రకాల పాత్రలు చేస్తోంది. ఇటీవల వచ్చిన పుష్ప సినిమా లోని ఐటమ్ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. పుష్ప సినిమాలో లోని ఐటమ్ సాంగ్ చేయడం వల్ల సమంతా కు ఎంత క్రేజ్ వచ్చిందో అంతే క్రేజ్ సమంత చేయడంవల్ల ఆ సాంగ్ కూడా వచ్చింది.

ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన రెండవ భాగం  పుష్ప 2 మొదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే పుష్ప 2 సినిమాల్లో కూడా ఐటమ్ సాంగ్ సమంతా నే చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే పుష్ప 2 సినిమాలో వచ్చే ఐటమ్ సాంగ్ బాలీవుడ్ కథానాయికను ఎంపిక చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పాట కోసం దిశా పఠానీ నీ తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

తెలుగు లో లోఫర్ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది దిశా. బాలీవుడ్లో మంచి కథానాయికగా పేరు సంపాదించుకుంది. ఇది పాన్ ఇండియా సినిమా కావున బాలీవుడ్ కథానాయిక ను తీసుకోవడం వల్ల సినిమాకు కలిసొస్తుందని ఆలోచిస్తున్నారు. అయితే అభిమానులు మాత్రం పుష్ పార్ట్ 2 సినిమాలోని ఐటెం సాంగ్ కు కూడా సమంతానే తీసుకోవాలని కోరుకుంటున్నారు. మరి దర్శకుడు ఎవరిని తీసుకుంటారో వేచి చూడాలి.