శ్రీలీల.. సుకుమార్ అడిగినా ఒప్పుకోలేదట..

శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న బ్యూటీ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఏ మూవీ చూసినా శ్రీలీల పేరే వినపడుతోంది. స్టార్ హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల వరకు అన్ని సినిమాల్లోనూ ఆమె నటిస్తోంది. ఆమె చేతిలో దాదాపు ఇప్పుడు పదికి పైగా సినిమాలు ఉండటం విశేషం. అందరూ హీరోలు తమ సినిమాల్లో శ్రీలీలే ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో, ఆమె తన బిజీ షెడ్యూల్ తో అన్ని సినిమాల్లోనూ నటిస్తూ, అదరగొడుతోంది.

అయితే, ఈ క్రేజీ బ్యూటీకి తాజాగా స్టార్ హీరో అల్లు అర్జున్ బంపర్ ఆఫర్ ఇచ్చారట. అయితే, ఆ ఆఫర్ ని ఆమె రిజెక్ట్ చేయడం గమనార్హం. అయితే, ఇందులో నిజం ఉందో లేదో తెలీదు కానీ, ప్రచారం మాత్రం చాలా గట్టిగా జరుగుతోంది. అల్లు అర్జున్ లాంటి హీరోతో నటించాలని దాదాపు అందరు హీరోయిన్లు ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది, శ్రీలీల కు ఆ ఆఫర్ వెతుక్కుంటూ వస్తే, కాదంటుందా అని పలువురు కామెంట్ చేస్తున్నారు.

కానీ, ఆమె అలా చేయడానికి కారణం ఉందట. రూమర్స్ ప్రకారం శ్రీలీలకు వచ్చిన ఆఫర్ ఏంటంటే, పుష్ప2లో ఐటెం సాంగ్స్ చేయడం. శ్రీలీల డ్యాన్స్ అద్భుతంగా చేస్తుంది కాబట్టి, ఆమె చేస్తే బాగుటుందని సుకుమార్ ఆమెను సంప్రదించారట. మొదటి భాగం పుష్ప లో స్టార్ హీరోయిన్ సమంతతో చేయించారు. ఆ ఊ అంటా వా పాట ఎంత క్లిక్ అయ్యిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు.

ఈ విషయం గుర్తుంచుకొని, మళ్లీ క్రేజ్ ఉన్న హీరోయిన్ తో చేయించాలని అనుకున్నారు. అందుకే శ్రీలలను అడిగారు. అయితే, ఇప్పటికే ఆమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. అవి పూర్తి చేయడానికే ఆమెకు చాలా కాలం పట్టేలా ఉంది. ఇంకా ఆమె చేయడానికి చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు. కొత్త హీరోల సినిమాల్లోనూ ఆమెనే లీడ్ పెయిర్ గా అడుగుతున్నారు.

ఇలాంటి సమయంలో ఐటెం సాంగ్ చేస్తే, మళ్లీ అలాంటి ఆఫర్లే వస్తాయని ఆమె భావిస్తుందట. అంతేకాకుండా, ప్రస్తుతం ఉన్న టైట్ షెడ్యూల్ లో ఇప్పుడు పాట చేయడం కూడా ఆమెకు కష్టమే. అందుకే, ఆమె రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. నిజంగా ఇది నిజం అయితే, ఆమె తీసుకున్న నిర్ణయం సరైందే అని పలువురు భావిస్తుండటం విశేషం.