సూపర్ స్టార్ ‘ సర్కారు వారి పాట ‘ లో సుధీర్ బాబు..?

జీ.ఎం.బి ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘ సర్కారు వారి పాట ‘. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయున్ గా నటిస్తుంది. థమన్ సంగీతమందిస్తున్నాడు. జనవరి నుంచి సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సుధీర్ బాబు కీలక పాత్ర పోషించబోతున్నట్టు తెలుస్తుంది.

Sarkaru Vaari Paata Motion Poster | Mahesh Babu | Parasuram Petla | Thaman  S - YouTube

రీసెంట్ గా మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు హీరోలుగా నటించిన సినిమా ‘ వి ‘ సినిమా ఓటీటీ లో రీలైజ సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియోషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. నివేదా థామస్, అదితి రావు హైదరి హీరోయిన్స్ నటించిన ఈ సినిమాలో నాని కంటే సుధీర్ బాబు బాగా హైలెట్ అయ్యాడు. ఇక ఇటీవలే సుధీర్ బాబు నటించబోతున్న తాజా చిత్రం శ్రీదేవి సోడా సెంటర్ అన్న సినిమా లాంచ్ అయింది. త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలబోతుంది.

Latest News Today,Current News,online News,Latest Breaking News  Headlines,Live News,Video News- Greatandhra

అయితే మహేష్ బాబు తో కలిసి సర్కారు వారి పాటలో కూడా సుధీర్ బాబు నటిస్తాడట. ఏ రోల్ లో కనిపించబోతున్నాడో సస్పెన్స్ గా ఉన్నప్పటికి ఇది మాత్రం ఘట్టమనేని ఫ్యాన్స్ కి మాత్రం గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇక సుధీర్ బాబు కూడా ఎప్పటి నుంచో మహేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఆ అవకాశం ఇప్పుడు సర్కారు వారి పాట సినిమాలో దక్కిందని అంటున్నారు. చూడాలి ఇద్దరు స్క్రీన్ మీద ఎలా మెస్మరైజ్ చేస్తారో.