‘సంఫీు’ అంటూ రజనీకాంత్‌పై విమర్శలు.. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్న కూతురు ఐశ్యర్య!

తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలను లైన్‌లో పెట్టారని తెలిసిందే. వీటిలో ఒకటి ఐశ్వర్య రజినీకాంత్‌ డైరెక్ట్‌ చేస్తున్న ‘లాల్‌సలామ్‌’ . విష్ణు విశాల్‌, విక్రాంత్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఐశ్వర్య రజినీకాంత్‌ ప్రమోషన్స్‌ వేగం పెంచింది.

రిపబ్లిక్‌ డే కానుకగా ఈ సినిమా ఆడియో లాంఛ్‌ ఈవెంట్‌ చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. అయితే ఈ ఈవెంట్‌లో ఐశ్వర్య మాట్లాడుతూ.. రజినీకాంత్‌ పై వస్తున్న ట్రోల్స్‌పై తాజాగా స్పందించింది. సోషల్‌మీడియాలో మా నాన్న ‘సంఫీు’ అంటూ కామెంట్స్‌ వస్తున్నాయి. నిజానికి సోషల్‌మీడియాకు నేను చాలా దూరంగా ఉంటా.. ఆన్‌లైన్‌ నెగెటివిటీ గురించి నా టీమ్‌ తరచూ చెబుతుంటుంది.

అలాగే నాన్నగారి పై వస్తున్న నెగటివిటీ గురించి కూడా నా టీమ్‌ ద్వారా తెలుసుకున్నాను. మేమూ మనుషులమే. మాకూ భావోద్వేగాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో నా తండ్రిని ‘సంఫీు’ (హిందుత్వ ఐడియాలజీని ఫాలో అయ్యేవారు) అంటూ విమర్శలు చేస్తున్నారు.

అయితే ‘సంఫీు’ అంటే మొదట్లో నాకు కూడా తెలిదు. కానీ తర్వాత దానికి అర్థం తెలుసుకున్నా. ఒక రాజకీయ పార్టీ(బీజేపీ)కి మద్దతు ఇచ్చేవారిని ‘సంఫీు’ అని పిలుస్తారని తర్వాత తెలుసుకున్నాను. రజనీకాంత్‌ సంఫీు కాదు. నాన్న అలాంటి వారే అయితే ‘లాల్‌ సలామ్‌’ చిత్రంలో మొయినుద్దీన్‌ భాయ్‌ పాత్రలో నటించే వారే కాదు. దయచేసి ఇలాంటివి ఆపండి అంటూ ఐశ్వర్య చెప్పింది. అయితే కూతురు మాటలు విన్న రజనీకాంత్‌ అక్కడే కన్నీళ్లు పెట్టుకున్నారు.