ఇండస్ట్రీ బజ్ : సూర్య భారీ చిత్రం రిలీజ్ కి టైం ఫిక్స్

తమిళ నాట ఉన్న స్టార్ హీరోస్ లో తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్నటువంటి వారిలో విలక్షణ హీరో సూర్య కూడా ఒకడు. మరి సూర్య హీరోగా ఇప్పుడు తన కెరీర్ లో 42వ సినిమాని అయితే చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమాగా మాసివ్ హైప్ తో తెరకెక్కుతుంది.

దర్శకుడు శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా ఈ సినిమాకి “కంగువ” అనే టైటిల్ ని లాక్ చేసి అనౌన్స్ చేయడంతో దానికి సెన్సేషనల్ రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ఈ భారీ సినిమాపై ఇప్పుడు ఓ బజ్ ఇండస్ట్రీ వర్గాల్లో తెగ వైరల్ గా మారింది. దీనితో ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే ఏడాదిలో ఏప్రిల్ రిలీజ్ కి తీసుకురాబోతున్నారని కన్ఫర్మ్ అయ్యింది.

కాగా ఏప్రిల్ 11న అయితే ఈ సినిమాకి పర్ఫెక్ట్ గా ఉంటుంది అని అందుకే మేకర్స్ ఆ డేట్ ని లాక్ చేసుకున్నట్టుగా ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. అప్పుడు హాలిడేస్ కూడా కలిసి రావడంతో మేకర్స్ ఈ డేట్ ని ఆల్ మోస్ట్ లాక్ చేసేశారని కన్ఫర్మ్ అయ్యింది.

ఇంకా ఈ చిత్రంలో బాలీవుడ్ హాట్ బాంబ్ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ చిత్రాన్ని మేకర్స్ ఏకంగా వరల్డ్ వైడ్ గా 10 భాషల్లో అనౌన్స్ చేయగా 3డి వెర్షన్ లో కూడా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.