తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ హీరోయిన్ ఆమె. తమిళ, హిందీ సినీ పరిశ్రమల్లోనూ ఆమెకు బోల్డంత ఫాలోయింగ్ వుంది. మరీ ముఖ్యంగా, తెలంగాణలో ఆమెకి సినిమా క్రేజ్‌తోపాటుగా, పొలిటికల్ క్రేజ్ కూడా వుంది.
రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం కోసం ఆమెను ఓ ప్రధాన పార్టీ సంప్రదించిందట. ‘పార్టీలో చేరాల్సిన పనిలేదు.. ప్రచారం చేస్తే చాలు’ అని కోరుతోందిట.
గతంలో, పలువురు రాజకీయ ప్రముఖులతో సన్నిహితంగా మెలిగిన ఆ హీరోయిన్, ఇప్పుడైతే రాజకీయాల జోలికి వెళ్ళకూడదనుకుంటోందట. దాంతో, సున్నితంగానే ఆ పొలిటికల్ ఆఫర్‌ని తిరస్కరించిందట.
సినిమాల్లో నటిస్తే వచ్చే రెమ్యునరేషన్ కంటే ఎక్కువే ఇస్తామంటున్నా, ఎన్నికల ప్రచారానికి ససేమిరా అంటోందట. ఎన్నికల ప్రచారమంటే ఫీల్డ్‌లో దిగి కాదు.. జస్ట్ డిజిటల్ ప్రచారమేనట.! ఎవరా హీరోయిన్.? ఏమా కథ.?