SSMB29: మహేష్ బాబు మూవీ.. జక్కన్న మౌనం వీడే సమయం వచ్చేసింది

SSMB29 మూవీ పై ఆసక్తిగా ఎదురుచూసే అభిమానులకు పెద్ద అప్‌డేట్ రాబోతోంది. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ పాన్ వరల్డ్ మూవీ షూటింగ్ హైద‌రాబాద్‌లో ప్రారంభమైందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. మొదటి షెడ్యూల్ పూర్తి అయిన వెంటనే రాజమౌళి ఒక ప్రత్యేక ప్రెస్ మీట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ సందర్భంలో సినిమా గురించి అన్ని ముఖ్యమైన విషయాలు బయటకు వస్తాయని తెలుస్తోంది.

ఇప్పటి వరకూ ఈ సినిమా అడ్వెంచర్ డ్రామా అని, మహేష్ బాబు ప్రపంచాన్ని చుట్టి తిరిగే వ్యక్తిగా కనిపిస్తారనే వార్తలు వినిపించినా, అధికారిక ప్రకటన రాలేదు. ప్రెస్ మీట్‌లో రాజమౌళి స్వయంగా కథా నేపథ్యం, ఇతర కీలక పాత్రలు, హీరోయిన్, టెక్నికల్ టీం గురించి తెలియజేస్తారని టాక్ ఉంది. RRR సమయంలో కూడా షూటింగ్ ప్రారంభమైన వెంటనే రాజమౌళి ఒక గ్రాండ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, మూవీ వివరాలను ప్రకటించారు. ఇప్పుడు SSMB29 కోసం కూడా అదే ఫార్మాట్ ఫాలో అవుతారనే అభిప్రాయం ఉంది.

ఈ ప్రెస్ మీట్ కేవలం సినిమా విశేషాలను మాత్రమే వెల్లడించడానికి కాదు, ప్రాజెక్ట్ ప్రోమోషన్ ప్రారంభించే వేదికగానూ నిలుస్తుందని చెబుతున్నారు. ఇది కేవలం భారత ప్రేక్షకులకు మాత్రమే కాకుండా, ఇంటర్నేషనల్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్వహిస్తారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఈవెంట్ గ్లోబల్ మీడియాలోనూ పెద్దగా హైలైట్ అవుతుందని సమాచారం.

ఈ ప్రెస్ మీట్‌లో మహేష్ బాబు లుక్, సినిమా ప్రత్యేకతలు, టైటిల్ (ఉంటే), రిలీజ్ ప్లాన్ వంటి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అభిమానులు ఈ అప్‌డేట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రాజమౌళి అధికారికంగా ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడే సమయం దగ్గర పడిందనే చెప్పాలి. మొత్తానికి SSMB29 చుట్టూ ఉన్న సీక్రెట్స్ తొలగి, మూవీ గురించి స్పష్టత వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అంత బలుపా | Senior Journalist Bharadwaj EXPOSED Producer SKN & Vaishnavi Chaitanya Controversy | TR