SSMB 28: మరో అప్డేట్ కూడా ఉంది!

త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న SSMB28 వచ్చే ఏడాది జనవరి 13 విడుదల కానుందని చెప్పడంతో ఇప్పటికే అభిమానులను సంతోషంలో మునిగిపోయారు. అయితే, చిత్ర నిర్మాత నాగ వంశీ మరో అప్డేట్ ఇచ్చాడు. మే నెలలో సూపర్‌స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా సినిమా అభిమానులకు మరో పెద్ద అప్‌డేట్ ఉండబోతోందని అన్నారు.

నిర్మాత ట్వీట్ ప్రకారం, మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు అయిన మే 31 న హైపర్ మాస్సీ అప్‌డేట్” విడుదల చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. అంటే అధికారిక టైటిల్‌తో పాటు సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసే అవకాశం ఉంది. SSMB28 ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ఇప్పటికే అభిమానుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది.

ఇక ఫ్యాన్స్ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా ప్రతీసారి టీజర్ లేదా పోస్టర్‌ను విడుదల చేసే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇక ఈ సంవత్సరం రివీల్‌పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.

SSMB28 సినిమా మహేష్ బాబు – త్రివిక్రమ్‌ల కలయికలో వస్తున్న మూడవ సినిమా కావడంతో అంచనాలు మామూలుగా లేవు. ఇక ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై S. రాధా కృష్ణ (చిన బాబు) నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే శ్రీలీల కథానాయికలుగా నటించగా, ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.