అప్పుడే ఆర్ఆర్ఆర్ విడుదల.. క్లారిటీ ఇచ్చిన రాజమౌళి.. ఫ్యాన్స్ రెడీ అయిపోండిక..!

ss rajamouli gives clarity on rrr movie release

దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అసవరం లేదు. హాలీవుడ్ లో జేమ్స్ కామెరూన్ ఎలాగో.. మన ఇండియాలో రాజమౌళి అలాగ. రాజమౌళితో సినిమా చేయాలని పెద్ద పెద్ద హీరోలు కూడా క్యూలో వేచి చూస్తున్నారు. జీవితంలో ఒక్కసారి అయినా రాజమౌళి దర్శకత్వంలో పని చేయాలని కోరుకుంటున్నారు.

ss rajamouli gives clarity on rrr movie release

బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి తన దృష్టినంతా ఆర్ఆర్ఆర్ మీద పెట్టారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లీడ్ క్యారెక్టర్లలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ అనేది అన్ని భాషలకు కామన్ టైటిల్. తెలుగులో మాత్రం రౌద్రం రణం రుధిరం అనే టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేశారు. ఇక.. ఈ సినిమాలో తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలకు చెందిన ఇద్దరు యోధులు.. చరిత్రలో ఎన్నడూ కలవనప్పటికీ.. వాళ్లు కలిస్తే ఎలా ఉంటుందో చెప్పేదే ఈ కథ.

నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో అయిపోవాల్సింది కానీ.. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఆగిపోయింది. ప్రస్తుతం కరోనా పరిస్థితులు ముందులా లేవు. ప్రభుత్వం కూడా షూటింగులకు అనుమతి ఇవ్వడంతో ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ కూడా షూటింగ్ కు సిద్ధమవుతోంది.

ss rajamouli gives clarity on rrr movie release

ఇప్పటికే సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయినా.. అసలు యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేయలేదట. అవి పూర్తయితేనే సినిమా షూటింగ్ పూర్తయినట్టు. మిగితా షూటింగ్ ను రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో చిత్రీకరిస్తున్నారట. ఆ షూటింగ్ పార్ట్ పూర్తవ్వాలంటే కనీసం రెండు నెలలు కంటిన్యూగా షూటింగ్ జరిగితేనే పూర్తవుతుందని.. మధ్యలో ఏదైనా ఆటంకం వస్తే మళ్లీ కథ మొదటికొస్తుందని రాజమౌళి అనుకుంటున్నారట.

అందుకే.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ డేట్ చెప్పడంపై రాజమౌళి కొంచెం సందిగ్దంలో పడ్డారట. అయితే.. కంటిన్యూగా రెండు నెలల పాటు షూటింగ్ జరిగితే.. సినిమా షూటింగ్ పూర్తవుతుంది. దీంతో రిలీజ్ డేట్ మీద ఒక అవగాహన వస్తుంది.. అని రాజమౌళి అంటున్నారు. అంటే.. డిసెంబర్ మొదటి వారం లోపు షూటింగ్ పూర్తయితే.. రెండు మూడు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం పెట్టుకున్నా.. వచ్చే ఏడాది సమ్మర్ సీజన్ లో సినిమా ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని అనుకోవాల్సిందే. వచ్చే ఏడాది సమ్మర్ లో ఇక ఫ్యాన్స్ కు పండగే.. అన్నమాట.

ఎన్టీఆర్ టీజర్ ను దసరా లేదా దీపావళికి రిలీజ్ చేయనున్నట్టు రాజమౌళి అన్నారు. ఇప్పటికే సీతారామరాజు క్యారెక్టర్ చేస్తున్న రామ్ చరణ్ టీజర్ ను మూవీ యూనిట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.