Ram Charan : శంకర్ సినిమా లో శ్రీకాంత్ ఇంట్రెస్టింగ్ పాత్ర..?

Ram Charan:మెగా స్టార్ చిరంజీవి నట వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ మొదట్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాత తనకంటూ సొంత గుర్తింపుతో నటన, గ్రేస్ ఉన్న డాన్సు తో ప్రేక్షకులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్,తారక్ కన్న కాంబినేషన్లో వస్తున్న అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్ విడుదలకు సిద్ధమైంది. మార్చి 25న ఈ సినిమా విడుదలకు ఏర్పాట్లు జరిగాయి. ప్రస్తుతం ప్రమోషన్ల బిజీ లో ఉన్నారు ఆర్ ఆర్ ఆర్ టీం. ఇదిలా ఉండగా ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాటు ఏక కాలంలోనే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఇది కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం శంకర్ చరణ్ కాంబినేషన్లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

శంకర్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే మూడు షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ కి జోడీగా కైరా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి మరొక వార్త వినిపిస్తోంది. ఈ సినిమాలో శ్రీకాంత్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడని చెప్తున్నారు. అంతే కాదు రామ్ చరణ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నాడట.

తండ్రి రామ్ చరణ్ పాత్రకు శ్రీకాంత్ మంచి స్నేహితుడుగా ఉంటాడని, అయితే పొలిటికల్ గా ఎదుగుతోన్న క్రమంలో చరణ్ కు సమయం చూసి వెన్నుపోటు పొడుస్తాడని తెలుస్తోంది.అలాగే మెయిన్ విలన్ గా చేస్తోన్న ఎస్ జె సూర్య పాత్రకు, శ్రీకాంత్ పాత్రకు మధ్య ఉన్న కనెక్షన్ కూడా షాకింగ్ గా ఉంటుందని సమాచారం. లుక్ కూడా చాలా కొత్తగా ఉంటుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ చెప్పిన సంగతి తెలిసిందే. అఖండ సినిమాతో మంచి విజయం అందుకున్న శ్రీకాంత్ శంకర్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నాడు చూడాలి.