Srikanth : అన్ని భాషల సినిమాల్లో విలన్ అవుతున్న శ్రీకాంత్…!

Srikanth : కెరీర్ మొదట్లో విలన్ షేడ్ ఉన్న పాత్రలు చేసి గుర్తింపు పొందిన శ్రీకాంత్ తర్వాత రోజుల్లో హీరోగా బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకున్నాడు. ఆ తర్వాత విలన్ పాత్రలకు దూరంగా ఉన్నాడు. అయితే ఇటీవలే మళ్ళీ బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమాలో మళ్ళీ విలన్ గా వరదరాజులు పాత్ర ద్వారా మెప్పించారు. ప్రేక్షకులకు వరదరాజు పాత్ర బాగా నచ్చడం తో శ్రీకాంత్ విలన్ గా కొనసాగాలని అనుకుంటున్నారు.

ఈ మధ్య సినిమాల జోరు తగ్గించిన శ్రీకాంత్ మంచి పాత్రలు దొరికినపుడు సహా నటుడుగా చేస్తూ వచ్చారు. అయితే ఇపుడు విలన్ గా ఇక వరుస సినిమాలు చేయాలనుకోవడం ఆయన అభిమానులను అందానికి గురిచేస్తోంది.పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా జేమ్స్ లో కూడా విలన్ గా శ్రీకాంత్ మెప్పించారు.

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఆయన ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. ఈ పాత్ర నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని అంటున్నారు. ఆ తర్వాత ఓ తమిళ సినిమాలో కూడా శ్రీకాంత్ చేస్తున్నాడు. మలయాళ కన్నడ భాషల నుంచి కూడా ఆయనకు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. మరి కలిసి వస్తున్న ఈ తరుణంలో శ్రీకాంత్ కెరియర్ ని ఏ విధంగా ప్లాన్ చేసుకుంటాడో చూడాలి.