‘పెదకాపు’లో విలన్‌ గా శ్రీకాంత్‌ అడ్డాల!

‘పెదకాపు’ ట్రైలర్‌ సంచలనం రేపింది. కుల రాజకీయాలతో అణచివేతకు గురవుతున్న ఓ గ్రామంలో వెనుకుబడిన కులానికి చెందిన ఓ కుర్రాడు వాళ్లకు ఎదురితిరిగి చేసిన పోరాటం ఎక్కడి వరకు తీసుకెళ్లిందనే కాన్సెప్ట్‌ను ట్రైలర్‌లో వివరించారు. ఒక్క ట్రైలర్‌తోనే సినిమాపై హైప్‌ ఎక్కడికో వెళ్లిపోయింది.

ఇక ఈ ట్రైలర్‌లో మరో షాకింగ్‌ విషయమేంటంటే దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల ఓ కీలకపాత్రలో కనిపించడం. ఆయన నోటి వెంట వచ్చిన డైలాగ్స్‌ బట్టి చూస్తే ఈ సినిమాలో ఈ పాత్ర కీలకం కాబోతుందని ఇట్టే అర్థమయిపోయింది. నిజానికి అడ్డాల తను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేసినప్పుడే కొన్ని సినిమాల్లో అలా కెమెరా ముందు కనిపించి వెళ్లాపోయాడు. ఇక ఇప్పుడు ఏకంగా కీ రోల్‌ ప్లే చేయడమంటే విశేషమనే చెప్పాలి.

ఇప్పటికే ఎంతో మంది దర్శకులు నటులుగా మారారు. కాశీ విశ్వనాథ్‌, దాసరి నారాయణ రావు ఈ మధ్య తరుణ్‌ భాస్కర్‌, సముద్ర ఖని ఇలా వీళ్లందరు ఫుల్‌ టైమ్‌ నటులుగా కూడా రాణించారు. ఇప్పుడదే బాటలో అడ్డాల కూడా అడుగులేశాడు. ఈ సినిమా ట్రైలర్‌ ఈవెంట్‌లో తను నటుడిగా మారడానికి కారణాన్ని కూడా అడ్డాల వెల్లడిరచాడు. ముందుగా ఆ క్యారెక్టర్‌కు మలయాళ నటుడు, రోమంచమ్‌ ఫేమ్‌ శౌబిన్‌ షహీర్‌ను అనుకున్నామని.

తను కూడా ఆ రోల్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని అడ్డాల వెల్లడిరచాడు. అయితే ఏమైందో తెలీదు కానీ అతను షూటింగ్‌కు రాలేదట, దాంతో అప్పటికప్పుడు మరో ఆర్టిస్టును వెతికే క్రమంలో తన అసోసియేట్‌ కిషోర్‌ ఆ క్యారెక్టర్‌ను తననే చేయమని ఒప్పించడంతో నటుడిగా అవతారమెత్తాల్సి వచ్చయిందని అడ్డాల చెప్పుకొచ్చాడు.

సగటు విలన్‌కు ఉండాల్సిన అన్ని లక్షణాలు శ్రీకాంత్‌లో పుష్కలంగా కనిపించాయి. ఇక భవిష్యత్తులో పలు డైరెక్టర్‌ల మాదిరిగానే శ్రీకాంత్‌ కూడా నటుడిగా బిజీ అవుతాడో చూడాలి మరి. పెద్దకాపు`1 సినిమాతో నిర్మాత మిర్యాల రవిందర్‌ రెడ్డి మేనల్లుడు హీరోగా పరిచయమవుతున్నాడు.