సెన్సేషనల్ సబ్జెక్ట్ తో శ్రీకాంత్ అడ్డాల.!

టాలీవుడ్ సినిమా దగ్గర తమ మొదటి సినిమాతోనే సెన్సేషన్ అందుకున్న దర్శకుల్లో తన మొదటి సినిమా కొత్త బంగారు లోకం చిత్రం తో ఆల్ మోస్ట్ ఇండస్ట్రీ హిట్ లెవెల్ హిట్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కూడా ఒకరు. మరి అక్కడ నుంచి స్వచ్ఛమైన తెలుగు నెల సినిమాలు తీసే దర్శకునిగా తాను పేరు తెచ్చుకోగా తర్వాత మాత్రం ఎందుకో బాగా స్లో అయ్యారు.

ఇక రీసెంట్ గా అయితే విక్టరీ వెంకటేష్ తో “నారప్ప” అనే యాక్షన్ రీమేక్ ని అయితే తాను చేశారు. కాగా ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల నుంచి మరో సెన్సేషనల్ చిత్రం ఇప్పుడు అనౌన్స్ చేసారు. బాలయ్య నిర్మాతలు మిర్యాల రవీంద్ర రెడ్డి తో అయితే శ్రీకాంత్ అడ్డాల లేటెస్ట్ గా అనౌన్స్ చేసిన చిత్రం “పెద కాపు”.

పేరు వింటేనే సబ్జెక్టు ఏంటి అనేది రివీల్ అయ్యిపోయింది. దీనితో నారప్ప తరహాలోనే ఓ ఇంట్రెస్టింగ్ ఏక్షన్ డ్రామా అయితే శ్రీకాంత్ అడ్డాల ప్లాన్ చేస్తున్నారని చెప్పాలి. కాగా ఈ తరహా తెలుగు మూలాలకి సంబంధించిన సినిమా కావడంతో ఇది హార్డ్ హిట్టింగ్ హిట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పాలి.

కాగా ఈ చిత్రం చిత్రంతో ఐటీ కొత్త హీరో విరాట్ కర్ణ ని పరిచయం చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. కాగా ఈ చిత్రం ఏకంగా మూడు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి మరి.