‘పుష్ప-2’లో శ్రీలీల స్పెషల్ సాంగ్.?

‘పుష్ప ది రైజ్’ కోసం సమంత చేసిన స్పెషల్ సాంగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ పాట కోసమే సినిమాని మళ్ళీ మళ్ళీ చూసినోళ్ళున్నారు.

అంతకు మించిన స్పెషల్ సాంగ్ ‘పుష్ప ది రూల్’ కోసం డిజైన్ చేయాలి కదా.? ఆల్రెడీ చేసేసే వుంటారు. కానీ, ఈసారి స్పెషల్ సాంగ్ చేయబోయేది ఎవరు.? సమంతతోనే చేయించే అవకాశమైతే లేదు. అనసూయ ఓ స్పెషల్ సాంగ్ చేస్తోందన్నది ఇప్పటిదాకా జరిగిన ప్రచారం. అదీ ఉత్త ప్రచారమే. బాలీవుడ్ నుంచి ఓ స్టన్నింగ్ బ్యూటీని దింపుతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నా.. అదెంతవరకు నిజం.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే.

తాజాగా, ఈ ఊహాగానాల లిస్టులోకి శ్రీలీల కూడా వచ్చి చేరింది. ‘ధమాకా’ తర్వాత శ్రీలీల పేరు డాన్సుల పరంగా మరింత మార్మోగిపోతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్‌తో శ్రీలీల స్పెషల్ సాంగ్ కోసం కాలు కదిపితే.. ఆ కిక్కే వేరప్పా.!