అది తగ్గించుకోమంటే కుదరదంటోన్న శ్రీలీల.!

బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ ఇచ్చేసింది శ్రీలీల.! ఎలా స్టార్‌డమ్ వచ్చేసిందో.. అలాగే స్టార్‌డమ్ అటకెక్కిపోవడానికి ఇంకొక్క సినిమా దూరంలో వుంది ప్రస్తుతం బబ్లీ బ్యూటీ శ్రీలీల.!

ఔను, ‘గుంటూరు కారం’ సినిమా ఫలితం తేడా కొడితే అంతే సంగతులు.! కానీ, ‘గుంటూరు కారం’ సినిమాతో శ్రీలీల బౌన్స్ బ్యాక్ అవుతుందన్న చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. ఈ సినిమాలో శ్రీలీల ఓ రేంజ్‌లో పెర్ఫామెన్స్ ఇచ్చేసిందట.! నిజమేనా.? ఏమోగానీ, ఏమాత్రం ఫలితం తేడా కొట్టినా.. సినిమా హిట్టయ్యీ ఆమెకు సరైన పాత్ర సినిమాలో లభించకపోయినా.. ఇక, శ్రీలీల గ్రాఫ్ అమాంతంగా పడిపోయినట్లేనన్నది నిర్వివాదాంశం.

ఈ నేపథ్యంలోనే, ఇప్పటికే కమిట్ అయిన ఓ మోస్తరు సినిమా తాలూకు నిర్మాత, ‘కొంచెం రెమ్యునరేషన్ తగ్గించుకో’ అని ఆమెకు సూచించాడట. ఓ యంగ్ హీరో నటిస్తున్న సినిమా అది. అయితే, శ్రీలీల మాత్రం ససెమిరా అంటోందిట.

ఫ్లాపులతో నాకేంటి సంబంధం.? అని సదరు నిర్మాత మీద శ్రీలీల రుసరుసలాడిందట. అసలే సదరు యంగ్ హీరో మార్కెట్ డల్లుగా వుండడంతో డీలాపడ్డ నిర్మాతకి, శ్రీలీల నుంచి వస్తున్న ఈ తరహా సమాధానాలతో మైండ్ బ్లాంక్ అయిపోతోందిట.

ఎవరా నిర్మాత.? ఏమా కథ.? అదైతే సస్పెన్స్. ఓ పూజా హెగ్దే.. ఓ కృతి శెట్టి.. ముందు ముందు శ్రీలీల కూడా అంతేనా.? అంతేనేమో.!