శ్రీలీల ఎక్కువగా ఆ పనే చేస్తుందటా..!

టాలీవుడ్ లో ఇప్పుడు అగ్ర కథానాయకురాలిగా అందరి అగ్ర నటుల సరసన చేస్తూ ఒక సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న బ్యూటీ శ్రీలీల. ఆమె చిత్రాలు ‘భగవంత్‌ కేసరి’ ఈ నెల 19న విడుదలవుతుండగా, ఇంకో సినిమా ‘ఆదికేశవ’ వచ్చే నెల నవంబర్‌ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ‘భగవంత్‌ కేసరి’ లో బాలకృష్ణ కథానాయకుడు కాగా, అందులో శ్రీలీల అతనికి కూతురుగా నటిస్తోంది. అనిల్‌ రావిపూడి దర్శకుడు, ఆ సినిమా మీద భారీ అంచనాలు వున్నాయి.

ఇక ‘ఆదికేశవ’ సినిమాలో వైష్ణవ తేజ సరసన నటిస్తోంది. దీనికి శ్రీకాంత్‌ రెడ్డి దర్శకుడు, ఇది ఒక వ్యాపారాత్మకమైన సినిమా. ఇందులో అన్ని అంశాలూ మిళితమై వుంటాయని చెపుతోంది శ్రీలీల. ఈ రెండు సినిమాలే కాకుండా, శ్రీలీల ఇంకా చాలా సినిమాల్లో నటిస్తోంది. మహేష్‌ బాబుతో ‘గుంటూరు కారం’, పవన్‌ కళ్యాణ్‌ తో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’, మధ్యలో నితిన్‌తో ‘ఎక్ట్స్‌ ఆర్డినరీ మేన్‌’ సినిమాలు కూడా చేస్తోంది.

అయితే ఇలా వరస సినిమాలు చేస్తున్న ఆమె మరి ఎప్పుడు నిద్రపోతుంది, ఇన్ని సినిమాల పాత్రలు ఎలా గుర్తుచుకుంటుంది అంటే, అన్నీ గుర్తుంటాయి అని చెప్తోంది. నేను ఏ సినిమా చేసినా ముందుగా నా సన్నివేశాలని తెప్పించుకుంటాను, అలాగే నేను చేసే సన్నివేశానికి ముందు తరువాత ఏమి జరుగుతుందో దర్శకుడిని అడిగి తెలుసుకుంటాను అని చెప్పింది.

అన్నీ గుర్తుంటాయి అని అంటోంది శ్రీలీల. అయితే ఆమె షూటింగ్‌ నుండి ఇంటికి, లేదా ఒక సినిమా లొకేషన్‌ నుండి ఇంకో లొకేషన్‌ కి వెళ్ళినప్పుడు కారులో ట్రావెల్‌ చేస్తుంది. అయితే కారులోకి ఎక్కగానే ఆమె ఏమి చేస్తుందో తెలుసా? కారులో వెంటనే నిద్రపోతుంది. ‘‘అవును, ఇది నిజం, నేను కారు ఎక్కగానే వెంటనే నిద్రపోతాను’ అని చెప్పింది శ్రీలీల.

అంటే ఆమె ఎంత బిజీగా వుందో అర్థం అవుతుంది. ఒక తెలుగు అమ్మాయి, చాలా సంవత్సరాల తరువాత ఇలా అగ్ర నటీమణిగా చలామణీ అవుతూ అగ్ర నటుల సరసన చేస్తూ ఉండటం స్ఫూర్తిదాయకం అనే చెప్పాలి!!