రష్మికకి బాలీవుడ్‌లోనూ ఎసరు పెట్టనున్న శ్రీలీల.?

ఇంతవరకూ రష్మికా మండన్నా పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోయింది. వరుస హిట్లూ.. ప్రెస్టీజియస్ ప్రాజెక్టులూ.. వెరసి చాలా తక్కువ టైమ్‌లోనే స్టార్ హీరోయిన్ ఛైర్ ఎక్కేసింది టాలీవుడ్‌లో రష్మికా మండన్నా. ఇప్పుడు శ్రీలీల వచ్చింది. తొలి సినిమా ఫ్లాప్. కానీ, విషయమున్న హీరోయిన్ కావడం, అందచందాలే కాదు, డాన్సులూ, హైపర్ యాక్టివ్‌నెస్.. ఇలా హీరోయిన్‌గా వుండాల్సిన అన్ని లక్షణాలూ వుండాల్సిన దానికన్నా కూసింత ఎక్కువే వుండడంతో శ్రీలీల, రష్మికా మండన్నా ప్లేస్‌ని ఆక్యుపై చేసేసేటట్టు కనిపిస్తోంది.

ఇప్పటికే పాప స్పీడుకు అరడజనుకు పైగా క్రేజీ ప్రాజెక్టులు పట్టేసింది. రష్మికా మండన్నా చేతిలో ‘పుష్ప 2’ తప్ప మరో ప్రాజెక్ట్ కనిపించడం లేదు. టాలీవుడ్ వరకే కాదండోయ్, కన్నడలోనూ రష్మికకు గండి కొట్టేసింది శ్రీలీల. అలాగే, తమిళంలోనూ త్వరలో జెండా పాతేయనుంది. ఇక, బాలీవుడ్‌నీ దున్నేసేందుకు సిద్ధమైంది శ్రీలీల.

రష్మికతో పోల్చితే, శ్రీలీల హవా పెరిగిందని భావించిన ఓ బాలీవుడ్ నిర్మాత శ్రీలీలతో సంప్రదింపులు జరుపుతున్నాడట. తొలుత రష్మికతో సినిమా చేయాలనుకున్న ఆ నిర్మాత, ఇప్పుడు శ్రీలీల వెంట పడుతున్నాడని సమాచారమ్.