శ్రీలీలకి వాళ్లతో కష్టమే సుమీ.!

మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ అయినప్పటికీ ఇండస్ర్టీలో ఎవరి కెరీర్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో.! ఎప్పుడు షాక్ తగిలి ముగిసిపోతుందో చెప్పలేని పరిస్థితి. ఎందరో హీరోయిన్లు వస్తుంటారు. కొన్నాళ్ల పాటు స్టార్‌డమ్ హోదా అనుభవించి పోతుంటారు.

ప్రస్తుతం ఆ సుడి శ్రీలీలకి నడుస్తోంది. ఏ హీరోని తీసుకున్నా.. శ్రీలీలనే హీరోయిన్ అంటున్నారు. ఆఖరికి పవన్ కళ్యాణ్ సైతం శ్రీలీలతోనే స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడంటే హీరోయిన్ల కరువు అనాలో, కొరతే అనాలో ఆ రేంజ్‌లో వుంది మరి.

అసలు మ్యాటర్ ఏంటంటే, ముందే చెప్పుకున్నాంగా.! హీరోయిన్ల కెరీర్‌కి అస్సలు గ్యారంటీ చెప్పలేం. ఇప్పుడు శ్రీలీల టైమ్ బాగానే నడుస్తోంది. కానీ, ఎన్ని సినిమాలని ఒప్పుకుంటుంది.? ఒప్పుకున్న అన్ని సినిమాల్నీ పూర్తి చేయగలిగేలా డేట్స్ అడ్జస్ట్ చేయాలి కదా.!

చిన్న సినిమాలూ, పెద్ద సినిమాలూ.. అనే తేడా లేకుండా అందిన ప్రాజెక్టులన్నీ ఒప్పేసుకుంది శ్రీలీల. ఇప్పుడు డేట్స్ అడ్జస్ట్ చేయలేక సతమతమవుతోంది.

ఇదే టైమ్‌లో లైమ్ లైట్‌లోకి వచ్చిన ముగ్గురు ముద్దుగుమ్మలు సంయుక్త మీనన్, మృణాల్ ఠాకూర్, మీనాక్షి చౌదరి. ఈ ముద్దుగుమ్మల విషయంలోనూ శ్రీలీలకి వచ్చినంత హైప్ రానే వచ్చింది. కానీ, ఈ భామలు తమ కెరీర్‌ని ఆచి తూచి డిజైన్ చేసుకుంటున్నారు.

పక్కాగా ఆలోచించి సెలెక్టివ్‌గా మాత్రమే సినిమాలు ఒప్పుకుంటున్నారు. దాంతో, ఎటువంటి ఒత్తిడి లేకుండా కెరీర్‌ని డిజైన్ చేసుకుంటున్నారు. మరి, ఆ ఆలోచన లేకుండా దూసుకెళ్లిపోతున్న శ్రీలీలకి ముందు ముందు ఈ ముద్దుగుమ్మలతో ముప్పు తప్పదుగా. టఫ్ కాంపిటేషన్ ఫేస్ చేయాలి సుమీ.!