రాబోయే పండగలంతా.. శ్రీలీలవే..

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్స్ లలో శ్రీ లీల టాప్ లిస్టులో కొనసాగుతోంది. మొన్నటి వరకు పూజా హెగ్డే రష్మిక మందన్న గ్యాప్ లేకుండా అవకాశాలు అందుకుంటూ వచ్చారు. ఇప్పుడు వారిని డామినేట్ చేస్తూ శ్రీ లీల స్టార్ హీరోలతోనే కాకుండా యువ హీరోలతో కూడా మంచి మంచి అవకాశాలు అందుకుంటుంది ఇక ఈ బ్యూటీ చేతిలో అయితే ఇప్పుడు కొన్ని క్రేజీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.

అయితే ముఖ్యంగా రాబోయే పండుగ దినాలలో ఈ బ్యూటీ కి సంబంధించిన ఏదో ఒక సినిమా అయితే విడుదల కాబోతోంది. అంతేకాకుండా రెగ్యులర్ గా ఏ సినిమా అప్డేట్ వచ్చినా కూడా మేజర్ గా అందులో శ్రీ లీల పేరు కూడా వినిపిస్తూ ఉండడం విశేషం. ప్రస్తుతం అమ్మడి హడావిడి మొత్తం స్కంద సినిమాతోనే నడుస్తోంది. ఈ సినిమా ఈ వినాయక చవితికి రాబోతోంది.

ఇక ఆ తర్వాత దసరా సమయంలో భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న ఆ సినిమాలో అమ్మడి పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నట్లు సమాచారం. ఇక ఆ తర్వాత దీపావళి సందర్భంగా వచ్చే ఆదికేశవ సినిమాలో కూడా ఈ బ్యూటీ మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ లో కూడా ఈ బ్యూటీ మెయిన్ హీరోయిన్. ఇక సినిమా క్రిస్టమస్ మూమెంట్ లో రానుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారంలో సినిమాలో అమ్మడు సెకండ్ రోల్ నుంచి ఏకంగా మెయిన్ హీరోయిన్ కు షిఫ్ట్ అయ్యింది. అందులో మహేష్ బాబుతో జోడి కట్టబోతోంది. ఇక ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ విధంగా అమ్మడు రాబోయే ఐదు ప్రధాన పండగలన్నిటినీ కూడా కవర్ చేయబోతోంది. ఇందులో రెండు మూడు సక్సెస్ అయినా కూడా ఆమె రేంజ్ మరింత పెరిగినట్లే.