మరో ప్లాప్ తో శ్రీలీల బ్యాడ్ ఫేజ్ కంటిన్యూ..!

టాలీవుడ్ సినిమా దగ్గర ఒక్క సినిమా హిట్ తో వెంటనే ఎక్కువ మొత్తంలో ఆఫర్స్ ఓ హీరోయిన్ కి రావడం అనేది చాలా అరుదు అని చెప్పాలి. మరి అలా గడిచిన రెండు మూడేళ్ళలో అయితే కొంతమంది హీరోయిన్స్ వచ్చారు. వారిలో మొదట కృతి శెట్టి పేరు వస్తుంది.

కానీ ఆమె సినిమాలు ఉండి ఉండి డిజాస్టర్స్ అవుతూ వచ్చాయి. ఇక ఆమెని రీప్లేస్ చేస్తూ వచ్చిన మరో యంగ్ సెన్సేషన్ హీరోయిన్ నే శ్రీలీల. ధమాకా సినిమాతో పెద్ద బ్రేక్ అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే మోస్ట్ బిజీ హీరోయిన్ గా తాను ఇప్పుడు నిలిచింది. పైగా ఆమె ఉంటే సినిమా హిట్ అవుతుంది అనే సెంటిమెంట్ కూడా ఒకటి.

కానీ సీన్ కట్ చేస్తే ఈ సెంటిమెంట్ బ్రేక్ అవ్వడానికి ఏడాది కూడా పట్టలేదు. గత ఏడాది డిసెంబర్ లో వచ్చిన ధమాకా చిత్రం తర్వాత ఆమె నుంచి చాలా సినిమాలు వచ్చాయి. ఈ జస్ట్ నాలుగు నెలల్లోనే నాలుగైదు సినిమాలు ఆమె నుంచి వస్తే ఏది కూడా హిట్ బాట పట్టలేదు.

మధ్యలో బాలయ్య భగవంత్ కేసరి పర్వాలేదు అనిపించింది కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం దానికీ నష్టాలు తప్పలేదు. పైగా కొన్ని వారాల కితమే వచ్చిన ఆదికేశవ ఓ డిజాస్టర్ అయితే మళ్ళీ దీని తర్వాత ఆమె హీరోయిన్ గా నటించిన “ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్” సినిమా కూడా ప్లాప్ అయ్యి కూర్చుంది.

దీనితో వరుసగా ఆమె ఇప్పుడు ప్లాప్ లు ఎదుర్కొంటుంది. సో ఇలా ఇంకా ఆమెకి బ్యాడ్ టైం నే నడుస్తుంది అని చెప్పాలి. మరి జనవరిలో గుంటూరు కారం సినిమా ఉంది. అది ఏమన్నా ఆమె ఫేట్ మారుస్తుందేమో చూడాలి.