అలా చేసినందుకు బాధపడ్డాను.. తన వైవాహిక జీవితం పట్ల ఎమోషనల్ అయిన సమంత!

నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత శోభిత ధూళిపాళ్లతో వివాహానికి సిద్ధమయ్యాడు. ఆమెతో వైవాహిక జీవితం ప్రారంభించేందుకు ఉత్సాహాన్ని చూపిస్తున్నాను అంటూ చాలా సంతోషంగా పెళ్లి పనులలో బిజీగా ఉన్నాడు. అయితే సమంత మాత్రం వివాదాస్పద అంశాలతో వైరల్ అవుతుంది. ఈ మధ్యనే తన ఎక్స్ కి ఇచ్చిన కాస్ట్లీ గిఫ్ట్ లు వేస్ట్ అయ్యాయని మాట్లాడి వైరల్ అయింది సమంత. ఇప్పుడు మళ్లీ ఒక ఇంటర్వ్యూలో తన డైవర్స్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది.

ఒక జంట విడాకులు తీసుకున్న తర్వాత అబ్బాయిని ఏమీ అనరు కానీ అమ్మాయిని మాత్రం నానా మాటలు అంటారు. డైవర్స్ తీసుకున్న తర్వాత తనని కూడా కొంతమంది సెకండ్ హ్యాండ్ అని యూస్డ్ అని కామెంట్లు చేశారని ఇలాంటి ట్యాగ్ ల పట్ల తాను చాలా బాధపడినట్లు చెప్పుకొచ్చారు. ఇలాంటి మాటలు ఆ అమ్మాయిని ఆమె కుటుంబాన్ని కూడా ఎంతగానో బాధిస్తాయి అని చెప్పుకొచ్చింది. విడాకుల తరువాత నిజా నిజాలు తెలుసుకోకుండా తనను దారుణంగా ట్రోలింగ్ చేశారని సమంత ఆవేదన వ్యక్తం చేసింది.

అయితే ఇలాంటి విషయాల పట్ల బాధపడటం వల్ల ప్రయోజనం లేదని అలాగే మన లైఫ్ లో జరిగిన ఒక సంఘటన వల్ల లైఫ్ ఎండ్ అయిపోలేదని గ్రహించి మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. కష్టకాలంలో ఎంతోమంది స్నేహితులు కుటుంబ సభ్యులు తనకు అండగా నిలిచారని సమంత తెలిసింది. అలాగే నాగచైతన్య వివాహం వార్త వెలుగులోకి రాగానే సమంత కోపంతో తన పెళ్లి గౌను రీ మోడల్ చేయించినట్లు వార్తలు వచ్చాయి.

ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న సమంత ని అడగగా నేను కోపమూ లేదా ప్రతీకారంతో పెళ్లి గౌనుని రీ మోడల్ చేయించలేదు. నిజానికి అలా చేయించేందుకు చాలా బాధపడ్డాను కూడా కానీ కొన్ని విషయాల్లో జీవితం ఎక్కడైతే ముగుస్తుందో మళ్ళీ అక్కడ నుంచే ప్రారంభమవుతుంది అని చెప్పుకొచ్చింది సమంత. అలాగే సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ కోసం తనని రాజ్ అండ్ డీకే సంప్రదించినప్పుడు అనారోగ్య కారణాల వలన తాను ఆ సిరీస్ చేయలేనని తనకి బదులుగా కియారా అద్వానీ లేదా కృతి సనన్ ని తీసుకోవాలని చెప్పిందంట. కానీ రాజ్ అండ్ డీకే అందుకు అంగీకరించకుండా సమంత కోలుకునే వరకు ఎదురు చూశారని చెప్పుకొచ్చింది సమంత.