విక్టరీ వెంకటేష్ సినిమాలలోని తన క్యారెక్టర్ల గురించి కొన్ని షాకింగ్ నిజాలు!

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్న ప్రముఖ అగ్ర హీరోలలో ఒకరు. నిర్మాత గా అత్యధిక సినిమాలు నిర్మించి ప్రపంచస్థాయి రికార్డు సాధించిన డి. రామానాయుడు రెండవ కుమారుడు. వెంకటేష్ 1960 లో జన్మించారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘కలియుగ పాండవులు’అనే సినిమా ద్వారా హీరోగా మొదటి అడుగు వేశారు. అలాగే ఈ సినిమా విజయం సాధించడం, ఈ సినిమా ద్వారా నూతన కథ నాయకుడిగా నంది అవార్డు కూడా పొందారు.

కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు చేశారు వెంకటేష్. ప్రేమ, చంటి, గణేష్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే లాంటి సినిమాలు వెంకటేష్ కు నంది అవార్డును తెచ్చిపెట్టాయి. వెంకటేష్ ఇప్పటివరకు దాదాపు 70కి పైగా సినిమాల్లో నటించారు. రెండు హిందీ సినిమాలలో కూడా నటించారు. వెంకటేష్ ను అభిమానులు విక్టరీ వెంకటేష్ అని, ముద్దుగా వెంకీ అని పిలుస్తారు. ఇప్పటివరకు 7 నంది అవార్డులను పొందారు.

వెంకటేష్ నటించిన చిత్రాలైన చంటి, కలిసుందాం రా, సుందరకాండ, బొబ్బిలి రాజా, సూర్యవంశం,రాజా పవిత్ర బంధం, లక్ష్మి, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే లాంటి సినిమాలు ఎంతో గుర్తింపు తీసుకువచ్చాయి. సౌందర్య, మీనా, ఆర్తి అగర్వాల్ లతో నటించిన అన్ని సినిమాలు విజయం సాధించాయి.

అయితే వెంకటేష్ నారప్ప సినిమా తర్వాత ఒక ఇంటర్వ్యూలో భాగంగా తాను చేసిన సినిమాలలోని క్యారెక్టర్ల గురించి మాట్లాడుతూ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారో చేయరో కాస్త టెన్షన్ గా ఉంటుంది. చంటి సినిమా ఇంకా పవిత్ర బంధం లో సౌందర్య కాళ్లు పట్టుకోవడం వంటివి ప్రజలు ఏ విధంగా తీసుకుంటారో కాస్త భయంగా ఉంటుంది. నారప్ప సినిమా కూడా కాస్త డిఫరెంట్ గా ఉంటుంది ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారో చేయరో అని ఒక సందర్భంలో చెప్పారు. మొత్తం మీద కంటెంట్ బాగా ఉంటే సరిపోతుంది .అందులో క్యారెక్టర్ ముఖ్యమే కానీ ప్రేక్షకులు కథను చూసి వాళ్ల అభిప్రాయాలు చెబుతుంటారు. అంటూ చెప్పుకొచ్చారు.