ఇండస్ట్రీ టాక్ : “గుంటూరు కారం”కి అక్కడ గట్టి డిమాండ్??

టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్నటువంటి పలు క్రేజీ కాంబినేషన్ లలో సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ల కాంబినేషన్ కూడా ఒకటి. కాగా ఈ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా అనౌన్స్ చేయడంతో అసలు గతంలో వీరికి ఉన్న ట్రాక్ రికార్డుని పట్టించుకోకుండా హైప్ నెక్స్ట్ లెవెల్లో నెలకొంది.

దీనితో కాస్త టైం పట్టినా కూడా గట్టి సినిమానే మేకర్స్ దింపుతున్నట్టుగా ప్లాన్ చేస్తుండగా మేకర్స్ ఇప్పటివరకు వచ్చిన అవుట్ పుట్ తో కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అయితే ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తుండగా తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకి భారీ డిమాండ్ నెలకొంది.

కాగా మెయిన్ గా అయితే తెలుగు రాష్ట్రాలు అంతా కూడా సింగిల్ స్క్రీన్స్ వారు గుంటూరు కారం చిత్రాన్ని ఎక్కువగా అడుగుతున్నారట. దీనితో చాలా వరకు సింగిల్ స్క్రీన్స్ లో గుంటూరు కారం మోత మోగించనుంది అని చెప్పవచ్చు. ఇప్పటికే బిజినెస్ లెక్కలు స్టార్ట్ అయ్యినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఇంకా ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ వారు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కాబోతుంది.