తన పెళ్లి చీర కి తానే డిజైనర్.. సాంప్రదాయానికి పెద్దపీట వేస్తున్న శోభిత ధూళిపాళ్ల!

నటి శోభిత ధూళిపాళ్ల మరొక రెండు రోజుల్లో బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెప్పి నటుడు నాగచైతన్యతో వివాహ బంధంలో అడుగు పెట్టబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఇరు కుటుంబాల్లో పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి కాబోయే వధూవరులకు ఇటీవల మంగళ స్నానాలు చేయించారు. దీనికి సంబంధించిన ఫోటోలను శోభిత సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అందులో ఆమె సంప్రదాయ చీర కట్టుతో మెరిసిపోతూ కనిపించారు. అయితే అందరి దృష్టి ఇప్పుడు తాను పెళ్ళిలో కట్టుకోబోయే చీర పై పడింది.

వివాహం అనగానే సాధారణ పెళ్లికూతుర్లు సైతం డిజైనర్ల వైపు దృష్టి సారిస్తున్న సమయంలో నటి శోభిత తన పెళ్లి దుస్తులు ఎవరితో డిజైనింగ్ చేయించుకుందో అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు జనాలు. అయితే శోభిత పెళ్లి దుస్తులు డిజైనర్ ఎవరో తెలిస్తే మీరు షాక్ అవుతారు. నిజమేనండి శోభిత పెళ్లి దుస్తుల డిజైనర్ పేరు శోభిత ధూళిపాళ్ల. మీరు విన్నది నిజమే ఎందుకంటే తన చీరని తానే డిజైన్ చేసుకుంది ఈ భామ. తల్లితో కలిసి పెళ్లి బట్టల షాపింగ్ చేస్తున్నప్పుడు సాంప్రదాయ కాంజీవరం పట్టుచీరను అలంకరించబడింది.

అలాగే పొందూరులో చేసిన సాధారణ తెల్లని ఖాదీ చీరతో పాటు చైతన్య కోసం మ్యాచింగ్ డ్రెస్ కూడా కొనుగోలు చేసిందంట శోభిత. ఆమె బట్టల సెలక్షన్ చూస్తుంటే సాంప్రదాయానికి స్వచ్ఛమైన నిబద్దతతో, తెలుగు వారసత్వంతో ఆమెకున్న లోతైన అనుబంధాన్ని తెలియజేస్తుంది. అలాగే పెళ్లిలో కూడా ఆమె డిజైనర్ ఆభరణాలు ఏమి ధరించడం లేదు, తల్లి నుంచి వారసత్వంగా వచ్చిన నగలను మాత్రమే ఆమె ధరిస్తుందని సమాచారం.

అయితే ఆమె నిశ్చితార్థం రోజు మాత్రం మనీష్ మాల్హోద్ర డిజైన్ చేసిన చీరను ధరించడం విశేషం. అలాగే వివాహానికి విచ్చేయబోతున్న అతి కొద్దిమంది బంధుమిత్రులు ఆత్మీయులకి ఇవ్వబోయే బహుమతులను ఆమె స్వయంగా తయారు చేస్తుందట. పెళ్లి శుభలేఖతోపాటు కొన్ని బహుమతులు ఉన్న బుట్టని అతిధులకి అందిస్తుందట. పెళ్లి శుభలేఖ కూడా రాజుల కాలంలో వచ్చే లేఖల మాదిరిగా డిజైన్ చేయించినట్లు సమాచారం.