Sobhita: నాగచైతన్య కాళ్లు మొక్కిన శోభిత.. ఇంకా ఎన్నాళ్ళిలా అంటూ ట్రోల్స్!

Sobhita: సినీ నటి శోభిత ఇటీవల నాగచైతన్యను పెళ్లి చేసుకోవడంతో వీరు పెళ్లికి సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. డిసెంబర్ 4వ తేదీ శోభిత నాగచైతన్యల వివాహం అన్నపూర్ణ స్టూడియోలో ఎంత ఘనంగా జరిగింది కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు సినీ సెలబ్రిటీల సమక్షంలో వీరి వివాహం జరిగిన సంగతి తెలిసిందే.

ఇలా నాగచైతన్య శోభిత పెళ్లి కావడమే కాకుండా మూడు రోజులుగా శోభిత చైతన్య ఇద్దరు కూడా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు. దీంతో ఈ ఫోటోలు వీడియోలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే శోభిత పెళ్లికి సంబంధించిన ఒక వీడియోలో భాగంగా నాగచైతన్య అక్షింతలు తీసుకొని శోభితను ఆశీర్వదిస్తారు అయితే ఇలా ఆయన నిలబడి శోభిత తలపై అక్షింతలు వేయడంతో శోభిత నాగచైతన్య పాదాలను తన రెండు చేతులతో తాకి కళ్ళకు అద్దుకొని నమస్కరించారు.

ఈ విధంగా శోభిత నాగచైతన్య పాదాలకు నమస్కారం చేయడంతో ఈ వీడియో పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే కొంతమంది నెటిజన్స్ ఈ వీడియో పట్ల స్పందిస్తూ..ఆడవాళ్లు ఇంకా ఎన్నాళ్లు మగవాళ్ళ కాళ్ళు మొక్కాలి?, మనం ఏ కాలంలో ఉన్నాం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దీంతో ఈ వీడియో నెట్టింట ట్రెడింగ్ గా మారింది.

ఇక శోభిత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి కావడంతో ఇలాంటి ఆచార వ్యవహారాలను చాలా పద్ధతిగా పాటిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తన పెళ్లి వేడుకను కూడా ఈమె చాలా సాంప్రదాయపద్ధంగా చేసుకున్న విషయం తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత వధువు తప్పనిసరిగా ఇలా వరుడు పాదాలకు నమస్కరిస్తుంది కానీ ఈ విషయంపై శోభితను మాత్రం భారీ స్థాయిలో ట్రోల్స్ చేయటం గమనార్హం.