‘యానిమల్‌’పై అంత క్యూరియాసిటీనా?

యానిమల్‌ సినిమాను డిసెంబర్‌ 1న పాన్‌ ఇండియా లెవల్లో హిందీ, తెలుగు, తమిళ,మళయాళం భాషల్లోనూ విడుదల చేయనున్నారు. ఈక్రమంలో ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌ ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేయగా అవి ఓ అంచనా వేయలేకుండా సినిమాలో సమ్‌థింగ్‌ ఉందనేలా ఉండడంతో సినీ అభిమానుల్లో క్యూరియాసిటీని మరింత పెంచాయి.

అయితే సినిమా విడుదలకు ముందే అప్పుడే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ కూడా మొదలై టికెట్స్‌కు డిమాండ్‌ పెరిగింది. ఇటీవలే తెలుగులో ఫేమస్‌ షో అయిన బాలకృష్ణ అన్‌ స్టాపబుల్‌లో పాల్గొని సినిమా ప్రమోషన్స్‌ కూడా చేశారు. ఇదిలాఉండగా ఇప్పుడు ఈ యానిమల్‌ సినిమా విషయంలో రెండు కీలక ఆప్డెట్స్‌ సోషల్‌మీడియాలో బాగా వైరల్‌ అవుతున్నాయి. థియేటర్లలో రిలీజ్‌కు ముందే సినిమాలోని మొదటి పది నిమిషాలను విడుదల చేయాలని ఆ చిత్ర యూనిట్‌ ఆలోచిస్తున్నదని వార్తలువస్తున్నాయి. అయితే గతంలో బాహుబలి వంటి ఒకటి రెండు సినిమాలు కూడా తమ చిత్రంలోని మొదటి పది నిమిషాలను సినిమా విడుదలకు ముందే అన్‌లైన్‌లో విడుదల చేశారు.

ఇప్పుడు అదే ఫార్ములాను ఈ యానిమల్‌ చిత్ర బృందం చేస్తున్నదని సమాచారం. ఇక సినిమా నిడివి విషయంలోనూ కొన్ని వార్తలు సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. సినిమా నిడివి 200 నిమిషాలు ఉంటుందని అంటే దాదాపు 3గంటల 20నిమిషాలు ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ వార్తలన్నింటిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో అనీల్‌ కపూర్‌, బాబీడియోల్‌ వంటి స్టార్స్‌ నటిస్తున్నారు. ఈ సినిమా అనంతరం సందీప్‌ రెడ్డి ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేయనున్నాడు.