ప్రస్తుతం హైదరాబాదులో ఎన్నో సినీ స్టూడియోలు ఉన్న విషయం మనకు తెలిసిందే అయితే చిత్ర పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్కు వచ్చిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో, రామకృష్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో వంటి వాటిని నిర్మించారు. అయితే చిత్ర పరిశ్రమ మొత్తం చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో ఎన్టీఆర్ మాత్రం తాను హైదరాబాద్ రానని చెప్పేసారట.ఇలా ఈయన హైదరాబాద్ రాకపోవడానికి గల కారణం ఈయనకు అప్పటికే కాంగ్రెస్ నేతలతో ఉన్న మనస్పర్థల కారణం చేత అన్నగారు హైదరాబాద్ రావడానికి ఇష్టపడలేదు.
ఇకపోతే అక్కినేని నాగేశ్వరరావు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ అప్పటి కాంగ్రెస్ నేతలతో ఈయనకున్న సాన్నిహిత్యం కారణంగా హైదరాబాద్ చేరుకొని అన్నపూర్ణ స్టూడియో నిర్మించారు.ఇక అన్నగారు సైతం హైదరాబాద్ వచ్చినప్పటికీ ఈయన సినిమా షూటింగ్లో నిమిత్తం హైదరాబాద్ నుంచి మద్రాస్ వెళ్లి వచ్చేవారు. అయితే ఈయన కూడా రామకృష్ణ స్టూడియో నిర్మించాలని భావించారు.
ఈ విధంగా రామకృష్ణ స్టూడియో నిర్మించాలని మొదలుపెట్టిన సమయంలోనే ఈ స్టూడియో నిర్మాణానికి ఎన్నో అడ్డంకులు ఏర్పడ్డాయి. అన్నగారు కాంగ్రెస్ నేతల మాటలు ఏమాత్రం వినకపోవడంతో స్టూడియో నిర్మాణానికి అనుమతులు లభించగా సుమారు ఈ స్టూడియో నిర్మించడానికి నాలుగు సంవత్సరాలు సమయం పట్టింది. నాలుగు సంవత్సరాల పాటు ఎన్టీఆర్ తన సినిమా షూటింగ్ ల కోసం హైదరాబాద్ నుంచి మద్రాస్ వెళ్లి వచ్చేవారు. నాలుగు సంవత్సరాల తర్వాత రామకృష్ణ స్టూడియో తయారు కావడంతో అనంతరం షూటింగ్ పనులు ఇక్కడే జరిగేవని, ఇలా అప్పట్లో ఈ స్టూడియో నిర్మాణానికి చాలామంది అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నం చేశారు.