అఖిల్ అక్కినేని ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటిస్తున్న క్రేజీ సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. పూజా హెగ్డే అఖిల్ సరసన నటిస్తున్న ఈ సినిమా ఈపాటికే టాకీ పార్ట్ కంప్లీట్ కావాల్సి ఉండగా లాక్ డౌన్ కారణంగా పోస్ట్ పోన్ చేశారు మేకర్స్. కాగా ఇటీవలే బ్యాలెన్స్ టాకీ పార్ట్ కంప్లీట్ చేసేందుకు హైదారాబాద్ లో తిరిగి షూటింగ్ ప్రారంభించారు. అఖిల్, పూజా హెగ్డే ల మీద కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
కాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా నాన్ స్టప్ గా పోస్ట్ ప్రొడక్షన్స్ అండ్ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి 2021 సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు రెండు డేట్స్ కూడా అనుకుంటున్నట్టు తెలుస్తుంది.
సంక్రాంతి పండుగ రోజు 14వ తేదీన దాదాపు రిలీజ్ డేట్ లాక్ చేసినట్టు సమాచారం. అదే రోజు గనక వేరే సినిమాలు కూడా రిలీజ్ కి ఉంటే ఒకరోజు ముందు అంటే 13వ తేదీన రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. అయితే ఫైనల్ డేట్ మాత్రం ఇంకా ఫిక్స కాలేదని త్వరలోనే ఈ విషయంలో ఒక క్లారిటీ రానుందని తెలుస్తుంది. అఖిల్ కూడా ఇంతక ముందు ఈ సినిమా జనవరి 2021లో రిలీజ్ ఉంటుందని అన్నాడు తప్ప పక్కాగా డేట్ మాత్రం చెప్పలేదు.
ఇక ఈ సినిమాని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతమందిస్తున్నాడు. కాగా ఈ సినిమా హిట్ అన్నది అటు అఖిల్ కి ఇటు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కి చాలా కీలకం. ముఖ్యంగా భాస్కర్ కి ఈ సినిమా లైఫ్ అండ్ డెత్ సమస్యగా చెప్పుకుంటున్నారు. ఒకవేళ అందరి అంచనాలకి తగ్గట్టు సూపర్ హిట్ అయితే అఖిల్ గురించి మొదటిసారి బాక్సాఫీస్ వద్ద కొత్త లెక్కలు రాసుకోవాల్సిందే.