బాక్సాఫీస్ : “స్కంద” 3 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు ఎంతంటే 

టాలీవుడ్ దగ్గర రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రం “స్కంద” తో యంగ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కించిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే మంచి హైప్ తెచ్చుకుంది. అప్పటికే మాస్ లో మంచి క్రేజ్ ని తెచ్చుకున్న రామ్ పోతినేని ఈ చిత్రంతోనే పాన్ ఇండియా లెవెల్ సినిమాని చేసాడు.

అంతే కాకుండా బోయపాటికి కూడా మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే. దీనితో ఫైనల్ గా రిలీజ్ చేసిన ఈ చిత్రం ఒక్క తెలుగు మినహా మిగతా భాషల్లో అయితే పెద్దగా రెస్పాన్స్ రాలేదు. కాగా ఈ చిత్రం అయితే తెలుగులో మేజర్ గా వసూళ్లు నమోదు అవుతూ వచ్చాయి.

మరి తెలుగులో అయితే ఈ చిత్రం మూడు రోజుల రన్ ని కంప్లీట్ చేసుకోగా ఈ మూడు రోజుల్లో చిత్రం 15 కోట్లకి పైగా షేర్ ని అందుకుంది. మరి ఈ మూడు రోజుల్లో అయితే వరల్డ్ వైడ్ గా కూడా అదిరే 34.4 కోట్ల గ్రాస్ ని ఈ చిత్రం అందుకున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

మరి ఈ చిత్రం యూఎస్ లో కూడా మంచి వసూళ్లు ఈ చిత్రం అందుకుంటుంది. దీనితో స్కంద మాత్రం మూడు రోజుల్లో యావరేజ్ గా కూడా 10 కోట్ల గ్రాస్ ని ఈజీగా టచ్ చేస్తుంది అని చెప్పాలి. అయితే ఓవరాల్ ఈ చిత్రం ఎంత వసూళ్ల దగ్గర ఆగుతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా థమన్ ఎస్ సంగీతం అందించాడు.