లేటెస్ట్ గా టాలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో కాస్త గట్టి చిత్రం “స్కంద” కూడా ఒకటి. మరి ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఈ సినిమాని తెరకెక్కించగా ఈ సినిమా అయితే టాలీవుడ్ లో ఒక క్రేజీ కాంబినేషన్ లలో ఒకదానిగా నిలిచింది.
కాగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేసినప్పటికీ అన్ని పాన్ ఇండియా సినిమాల్లానే ఇది కూడా లిమిటెడ్ రిలీజ్ తోనే నిలిచిపోయింది. ఇక మొదటి రోజే ఈ చిత్రం 18 కోట్లకి పైగా వసూళ్ళని రాబట్టగా రెండో రోజు కూడా మంచి వసూళ్లనే ఈ సినిమా అందుకున్నట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.
కాగా రెండో రోజు ఏపీ తెలంగాణ వసూళ్లు చూసినట్టు అయితే నైజాం లో ఈ చిత్రం 1.52 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకోగా సీడెడ్, వైజాగ్ మిగతా ఏపీ ప్రాంతాలు మొత్తం కలిపి ఈ చిత్రం 2 కోట్ల షేర్ ని అందుకుంది. దీనితో రెండో రోజు ఈ చిత్రం తెలుగు స్టేట్స్ లో మూడున్నర కోట్లకి పైగా వసూళ్లు అందుకోగా ఇంట్రెస్టింగ్ గా ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ గా యూఎస్ లో మంచి వసూళ్లు రాబడుతూ ఉండడం విశేషం.
అక్కడ ఈ చిత్రం 2 లక్షల 50 వేల డాలర్స్ మేర ఇప్పుడు రాబట్టేసింది. ఇది బోయపాటి రామ్ సినిమాలకి కూడా ఆశ్చర్యకర నెంబర్ అనే చెప్పాలి. ఇలా వరల్డ్ వైడ్ గా అయితే స్కంద రెండు రోజుల్లో 15 కోట్లకి పైగా షేర్ ని రిజిస్టర్ చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు. మొత్తానికి అయితే స్కంద డీసెంట్ గానే కొనసాగుతుంది.