సితార ట్యాలెంట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. ఆమెలోని ఆర్టిస్ట్ ఇలా బయటకు వచ్చేసింది!!

Sitara Ghattamaneni Draws Pictures Like Artist

మహేష్ బాబు ముద్దుల కూతురు సితార ఘట్టమనేని గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. సితారను ముద్దుగా సీతూ పాప అని అభిమానులు పిలుచుకుంటారు. సితార మల్టీ టాలెంటెడ్. ఆమె ఇంగ్లీష్‌లో మాట్లాడితే ఎవ్వరైనా కళ్లు తిరిగి పడిపోవాల్సిందే. ఇక ఆమె పాట పాడినా, స్టెప్పులు వేసినా సోషల్ మీడియాలో షేక్ అవుతుంది. ఆ మధ్య లాక్డౌన్‌లో నమ్రత నిరంతరంగా సితార పాడిన పాటలు, వేసిన స్టెప్పులకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ వచ్చేది.

Sitara Ghattamaneni Draws Pictures Like Artist
Sitara Ghattamaneni Draws Pictures Like Artist

ఇక సితార మహేష్ బాబును ఎలా ఏడిపిస్తుందో.. అన్న గౌతమ్‌ను ఎలా ఆట పట్టిస్తుందో అందరికీ తెలిసిందే. నాన్నతో పాటు స్విమ్మింగ్‌లో పోటీ పడేది.. అన్న గౌతమ్ వీడియో గేమ్‌లు ఆడితే.. నాన్నతో కలిసి చెడగొట్టేసేది. అల్లరి పిల్ల సితారను నవ్వించేందుకు మహేష్ బాబు చిన్న పిల్లాడిలా మారతాడు.. గెంతులు వేస్తాడు.. జోకులు చెబుతాడు. వెరైటీ ఆటలు ఆడతాడు. అలా తన గారాల పట్టిని ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూస్తాడు.

అయితే సితారా తన సోషల్ మీడియాలో ఖాతాల్లో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. మన పనులు మనమే చేసుకోవాలి అంటూ ఆ మధ్య చీపురు పట్టి ఊడ్చింది కూడా. అయితే తాజాగా సితార ఓ వీడియోను షేర్ చేసింది. అందులో తాను దించిన బొమ్మలను చూపెట్టింది. అవి చూస్తుంటే సితారలో ఓ మంచి ఆర్టిస్ట్ దాగుందని తెలుస్తోంది. ఆమెకు ఇచ్చిన హోం వర్క్‌లో భాగంగా వాటిని డ్రా చేసినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం సితార షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.