మహేష్ బాబును ఇలా ఆడుకుంటుందేంటి.. సితార పాప రచ్చ మామూలుగా లేదు!!

Sitara Ghattamaneni annoys Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు సిల్వర్ స్క్రీన్ మీద రౌడీలను చితక్కొట్టేయొచ్చు. కానీ ఇంట్లో మాత్రం పిల్లల ముందు వంగిపోవాల్సిందే. పిల్లల అల్లరికి తల వంచాల్సిందే. పిల్లలతో కలిసి ఆటలు ఆడాల్సిందే. మహేష్ బాబు తెరపై ఎంత గంభీరంగా ఉన్నా కూడా ఇంట్లోకి వచ్చేసరికి పిల్లాడిలా మారిపోతాడు. సితార, గౌతమ్‌లతో కలిచి మూడో పిల్లాడిగా మారి రచ్చ చేస్తాడు. ఒక్కోసారి అసలు గౌతమ్ ఎవరు.. మహేష్ బాబు ఎవరో కూడా కనిపెట్టలేరు. అంతలా కలిసిపోతాడు.

Sitara Ghattamaneni annoys Mahesh Babu
Sitara Ghattamaneni annoys Mahesh Babu

మహేష్ బాబు తన పిల్లలతో కలిసి చేసే రచ్చను లాక్డౌన్‌లో అభిమానుల ముందుకు తీసుకు వచ్చింది నమత్ర. మహేష్ చేసే చిలిపి అల్లరిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. మహేష్ బాబు ఫ్యామిలీతో ఎంత ఫన్ చేస్తాడో నమ్రత వల్లే తెలిసింది. ఇక సితార సైతం తన తండ్రిని ఆట పట్టిస్తుంది.. కొన్ని సందర్భాల్లో తండ్రితో కలిసి అన్న గౌతమ్‌ను ఆడుకుంటుంది. ఇలా సితూ పాప చేసే అల్లరిని అభిమానులు చూసి సంబరపడిపోతుంటారు.

సితార తన సోషల్ మీడియా ఖాతాల్లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫ్యామిలీ ట్రిప్, మహేష్ బాబు విశేషాలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా మహేష్ బాబును ఓ రేంజ్‌లో ఆడుకుంది. మహేష్ బాబును సితార అర్దరాత్రి ఆట పట్టించినట్టు కనిపిస్తోంది. నిద్రలో ఉండగా మహేష్ బాబును తన కెమెరాలో బంధించేందుకు ప్రయత్నించగా.. మహేష్ బాబు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. నాన్నా.. నువ్ నా కెమెరా నుంచి తప్పించుకోలేవ్ అంటూ సితారా బెదిరిస్తూ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.