క‌రోనా టెస్ట్ చేయించుకున్న సితార‌.. త‌న వ‌య‌స్సు పిల్ల‌ల‌ని చేయించుకోమ‌న్న మ‌హేష్ కూతురు

గత ఏడాది అనుకోని అతిథిలా వచ్చిన క‌రోనా మ‌హ‌మ్మారి ఈ ఏడాది చివ‌ర‌కు క‌నుమ‌రుగు అవుతుంద‌ని అంతా అనుకుంటున్న స‌మ‌యంలో మ‌రో కొత్త ర‌కం క‌రోనా ఇప్పుడు అంద‌రని భ‌య‌బ్రాంతుల‌కు గురి చేస్తుంది. ఈ వైర‌స్ వ‌ల‌న ఎక్క‌డికి వెళ్లాల‌న్నా, ఏ ప‌ని చేయాల‌న్నా కూడా గుబులు ప‌డుతుంది. ముఖ్యంగా సినీ ప‌రిశ్ర‌మ‌లో షూటింగ్ చేయాలంటే వంద‌లాది మంది క‌లిసి ప‌ని చేయాలి. కాని క‌రోనా వ‌ల‌న ప‌లు ఆటంకాలు ఏర్ప‌డుతున్నాయి. అనేక జాగ్ర‌త్తలు పాటించి షూటింగ్ చేస్తున్న‌ప్ప‌టికీ, క‌రోనా మ‌హ‌మ్మారి ఏదో మూల నుండి ప‌ట్టిపీడిస్తూనే ఉంది.

రీసెంట్‌గా అన్నాత్తె చిత్ర షూటింగ్‌లో న‌లుగురికి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో షూటింగ్ అర్దాంత‌రంగా ఆపేశారు. ఇక రీసెంట్‌గా మ‌హేష్ బాబు, వ‌రుణ్ తేజ్‌ల‌కు కూడా క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ కావ‌డంతో వారికి సంబంధించిన షూటింగ్స్ కూడా తాత్కాలికంగా ఆగినట్టు తెలుస్తుంది. సినిమా సెల‌బ్రిటీలు అంటే న‌లుగురిని క‌లుస్తుండ‌డం కామ‌న్‌. ఇలాంటి సంద‌ర్బంలో ఎవ‌రి నుండి ఎవ‌రికి క‌రోనా వ‌స్తుంద‌నేది అంచ‌నా వేయ‌లేక‌పోతున్నాం. తాజాగా మ‌హేష్ గారాల ప‌ట్టి సితార కూడా క‌రోనా టెస్ట్ చేయించుకోని త‌న తోటి వ‌య‌స్సు ఉన్న వారు కూడా ఏ మాత్రం భ‌య‌ప‌డకుండా చేయించుకోవాలంటూ కోరింది.

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సితార రెగ్యుల‌ర్‌గా అప్‌డేట్స్ ఇస్తూనే ఉంటుంది. త‌న తండ్రి మాదిరిగానే ఈ చిన్నారికి కూడా చాలా ఫాలోవ‌ర్స్ ఉన్నారు. అయితే తాజాగా త‌ను క‌రోనా టెస్ట్ చేయించుకున్న వీడియోని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. జంకు గొంకు లేకుండా క‌రోనా టెస్ట్ చేయించుకున్న సితార .. ముందు నేను టెస్ట్ చేయించుకోవ‌డానికి భ‌య‌ప‌డ్డాను. ప‌క్క‌న అమ్మ చేయి ప‌ట్టుకొని కూర్చున్నా. టెస్ట్ చేయించుకునేందుకు భ‌య‌ప‌డ‌వ‌ద్దు. మన ఆరోగ్యం, స‌మాజం కోసం ప్ర‌తి ఒక్క‌రు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోండి అంటూ త‌న వ‌య‌సు పిల్ల‌లంద‌రికి తెలిపింది సితార‌. ప్ర‌స్తుతం సీతూ పాప పోస్ట్ చేసిన వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది.